పాస్ పోర్ట్ ఇక ఈజీ.! బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు.! స్కూల్లో ఇచ్చే T.C లు మార్కుల మెమోలు చాలు.

ఇన్నాళ్లు పాస్ పోర్ట్ కావాలంటే…బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి గా సమర్పించాల్సిన అవసరం ఉండేది. ఇక బర్త్ సర్టిఫికేట్ కోసం అయితే చిన్నపాటి యుద్దమే చేయాల్సి వచ్చేది! తాము పుట్టిన హాస్పిటల్స్ కు వెళ్లి, రికార్డులను తిరిగేసి, అక్కడి సిబ్బందికి అంతో ఇంతో ముట్టజెబితేనే….బర్త్ సర్టిఫికేట్ మనచేతికి దక్కేది. బర్త్ సర్టిఫికేట్ తో సహా…మొత్తం 15 రకాల అనుబంధ పత్రాలను జతచేస్తే… చివరకు పోలీస్ ఎంక్వైరీ తర్వాత పాస్ట్ పోర్ట్ వచ్చేది.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం…పాస్ పోర్ట్ జారీ నిబంధనలను సింప్లిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం పాస్ పోర్ట్ కోసం  జతచేయాల్సిన 15 అనుబంధ పత్రాలలో ఆరింటిని తొలగించారు.( Annexure A,C,D,E,J,K) వాటి స్థానంలో…తెల్ల కాగితంపై కావాల్సిన సమాచారాన్ని రాసి…మీ సంతకం( సెల్ఫ్ అటెస్టెడ్) పెడితే సరిపోతుంది. నోటరీ చేయించాల్సిన అవసరం కూడా లేదు. 1989 జనవరి 26 కు ముందు పుట్టిన వారైతే….బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

బర్త్ సర్ట్ ఫికెట్స్ స్థానంలో ఇవి ఉన్నా ఓకే.

  • స్కూల్లో ఇచ్చే T.C( Transfer Certificate), మార్క్స్ మెమోస్.
  •  పాన్, ఆధార్ కార్డ్స్,
  •  సర్వీస్ రికార్డ్స్ ( ఉద్యోగులకు మాత్రమే)
  • పే పెన్సన్ ఆర్డర్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ ఐడి( రిటైర్డ్ ఉద్యోగులకు)
  • గతంలో ఉద్యోగులు పాస్ పోర్ట్ నిమిత్తం..తమ ఉన్నత అధికారులతో…నో అబ్జక్షన్ లెటర్ తీసుకురావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు జస్ట్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాం అనే ప్రమాణపత్రం రాసి ఇచ్చినా సరిపోతుంది.
  • సాధువులు సన్యాసులు తమ తండ్రి పేరు స్థానంలో, తమ గురువు పేర్లను రాసుకునే వెసులుబాటు కూడా ఉంది.

Comments

comments

Share this post

scroll to top