పొట్ట ద‌గ్గ‌ర అధికంగా ఉన్న కొవ్వు క‌ర‌గాలా..? అయితే ఈ కింది ఆస‌నాల‌ను నిత్యం వేయండి…

ఎవ‌రైనా వ్య‌క్తులు అధికంగా బ‌రువు ఉన్నారంటే చాలు వారిలో మ‌న‌కు ప్ర‌ధానంగా క‌నిపించేది పొట్ట‌. అవును, ఎక్కువ బ‌రువుండే ప్ర‌తి ఒక్క వ్య‌క్తికి పొట్ట అధికంగానే ఉంటుంది. దీంతో ఎన్నో అనారోగ్యాలు కూడా ఇలాంటి వారికి పొంచి ఉంటాయి. ఈ క్ర‌మంలో పొట్ట ద‌గ్గ‌ర అధికంగా ఉన్న కొవ్వును క‌రిగించ‌డం కోసం, అస‌లు పొట్ట‌ను పూర్తిగా త‌గ్గించుకోవ‌డం కోసం యోగా చ‌క్క‌ని ప‌రిష్కారం చెబుతోంది. కింద ఇచ్చిన ప‌లు ఆస‌నాల‌ను నిత్యం వేస్తే చాలు పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌ర‌గ‌డ‌మే కాదు, కొద్ది కాలంలోనే పొట్ట కూడా త‌గ్గుతుంది. ఆ ఆస‌నాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

belly-fat-yoga-asanas

భుజంగాస‌నం…
కాళ్ల‌ను, మోకాళ్ల‌ను, పొట్ట‌ను, ఛాతిని నేల‌కు తాకేలా ఆనిచ్చి నుదురు నేల‌కు తాకేలా బోర్లా ప‌డుకోవాలి. వీలైనంత వ‌ర‌కు కాళ్ల‌ను ద‌గ్గ‌ర‌గా ఉండేలా చూడాలి. అర‌చేతుల‌ను భుజాల కిందుగా తీసుకుని వాటిని నేల‌కు ఆన్చాలి. మెల్ల‌గా గాలిని పీలిస్తూ అర‌చేతుల‌ను నేల‌వైపుకు పెట్టి వాటిపై ఒత్తిడి చేస్తూ త‌ల‌ను, ఛాతీ భాగాన్ని, పొట్ట‌నూ పైకి లేపాలి. పొట్ట కింది వైపుకు నేలను ఆనేలా చూసుకోవాలి. ఈ స్థితిలో 5 సార్లు ఊపిరి పీల్చి వ‌ద‌లాలి. అనంత‌రం నెమ్మ‌దిగా మామూలు స్థితికి రావాలి.

భుజంగాస‌నం వేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. ఛాతి భాగం దృఢ‌మ‌వుతుంది. వెన్నెముక గ‌ట్టిప‌డుతుంది.

ధ‌నురాస‌నం…
నేల‌పై బోర్లా ప‌డుకోవాలి. కాళ్ల‌ను వెన‌క‌కు మ‌డిచి పిరుదుల‌కు ఆన్చాలి. కాళ్ల‌ను చేతుల‌తో ప‌ట్టుకుని సుదీర్ఘ‌మైన శ్వాస తీసుకుంటూ కాళ్ల‌ను చేతుల‌తో ప‌ట్టుకుని లాగాలి. ఈ స్థితిలో వీలైనంత వ‌రకు ఉండి శ్వాస‌ను వ‌దిలివేస్తూ మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి రావాలి.

ఈ ఆస‌నం వల్ల జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు కూడా క‌రుగుతుంది.

నౌకాస‌నం…
వెల్ల‌కిలా ప‌డుకుని సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ చేతుల‌ను కాళ్ల‌పైకి తీసుకురావాలి. కాళ్లు మ‌రీ పైకి రాకూడ‌దు. ఈ స్థితిలో వీలైనంత వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. అనంత‌రం తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకోవాలి.

ఈ ఆసనాన్ని నిత్యం వేయ‌డం వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పోతుంది. గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు కూడా ఉండవు. వెన్నెముక‌, న‌డుము బ‌లోపేత‌మ‌వుతాయి. ఋతుక్ర‌మం స‌రిగ్గా ఉంటుంది.

చ‌తురంగ దండాస‌నం…
నేల‌పై బోర్లా ప‌డుకుని అర‌చేతుల‌ను ఛాతి ద‌గ్గ‌ర నేల‌కు ఆనించాలి. శ్వాస తీసుకుంటూ శ‌రీరాన్ని పైకి తీసుకురావాలి. చేతులు, పాదాలు మాత్ర‌మే నేల‌పై ఉంచాలి. త‌రువాత శ్వాస‌ను వ‌దిలివేస్తూ పూర్వ స్థితికి రావాలి. దీన్ని నిత్యం 5 నుంచి 7 సార్లు చేయాలి.

ఈ ఆస‌నం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. భుజాలు, అర‌చేతులు, వెన్నెముక‌, తొడ‌లు, పిరుదులు గ‌ట్టి ప‌డ‌తాయి.

belly-fat-yoga-asanas

ప‌వ‌న‌ముక్తాస‌నం…
నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకోవాలి. గాలి పీల్చి రెం డు కాళ్ల‌ను 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. అనంత‌రం గాలి వ‌దులుతూ కాళ్ల‌ను రెండు చేతుల‌తో ప‌ట్టుకోవాలి. అదే స‌మ‌యంలో త‌ల‌ను, భుజాల‌ను నేల మీద నుంచి పైకి లేపి త‌ల‌కు రెండు మోకాళ్ల‌ను ఆన్చాలి. అలా 5 సెక‌న్ల పాటు ఉండి నెమ్మ‌దిగా గాలి పీలుస్తూ త‌ల‌ను వెన‌క్కి తేవాలి. గాలి వ‌దులుతూ య‌థాస్థితికి రావాలి. ఈ విధంగా నిత్యం 3 సార్లు చేయాలి.

ఈ ఆస‌నం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌రుగుతుంది. క్లోమ‌గ్రంథి (పాంక్రియాస్‌) ఉత్తేజ‌మ‌వుతుంది. ఇది డ‌యాబెటిస్ ఉన్న వారికి ఉప‌శ‌మనాన్ని ఇస్తుంది. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు పోతాయి. న‌డుము భాగం ఉత్తేజితం అవుతుంది. పున‌రుత్ప‌త్తి అవ‌య‌వాల ప‌నితీరు మెరుగుప‌డుతుంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top