వ్యాయామం చేయకుండా సుల‌భంగా బ‌రువు ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

శ‌రీరంలోని ప‌లు భాగాల‌పై ఒత్తిడి క‌ల‌గ‌జేస్తూ ఆయా ప్రాంతాల్లో సున్నితంగా మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని మ‌నం ఇది వ‌ర‌కు చ‌దివాం. తెలుసుకున్నాం. ఈ విధానాన్ని ఆక్యుపంక్చ‌ర్‌, ఆక్యుప్రెష‌ర్ అంటార‌ని కూడా మ‌నంద‌రికీ తెలుసు. అయితే ఈ ప‌ద్ధ‌తి ద్వారా శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును, త‌ద్వారా బ‌రువును సులభంగా తగ్గించుకోవ‌చ్చ‌ట‌. మ‌రింకెందుకాల‌స్యం! బ‌రువు త‌గ్గించుకోవాలంటే శ‌రీరంలో ఏయే భాగాల్లో ఒత్తిడి క‌లిగించాలో, ఏయే భాగాల‌పై మ‌సాజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

weight-loss-point-1

1. చిత్రంలో చూపిన విధంగా ముఖంపై ఉన్న ఈ భాగంపై ఒత్తిడి క‌ల‌గ‌జేస్తే అది మ‌న ఆక‌లిని కంట్రోల్ చేస్తుంద‌ట‌. అంతేకాదు ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను కూడా తగ్గిస్తుంద‌ట‌. నిత్యం రెండు సార్లు ఈ పాయింట్‌పై 5 నిమిషాల పాటు మ‌సాజ్ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

2. చేతిపై ఉండే ఈ ప్రాంతంపై మ‌సాజ్ చేస్తే శ‌రీరంలో అధికంగా ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంద‌ట‌. అంతేకాదు పేగుల క‌ద‌లిక‌లు క్ర‌మ‌బ‌ద్ద‌మ‌వుతాయ‌ట‌. శ‌రీర‌మంత‌టా శ‌క్తి స‌మానంగా విస్త‌రిస్తుంద‌ట‌.

weight-loss-point-2

3. కాలుపై ఈ పాయింట్ వ‌ద్ద నిత్యం 9 సార్లు లేదా 10 నిమిషాల పాటు గ‌డియారం ముల్లు తిరిగే దిశ‌లో క్లాక్‌వైజ్‌గా మ‌సాజ్ చేయాలి. దీని వ‌ల్ల నిద్ర‌లేమిత‌నం దూర‌మ‌వుతుంది. ఇది కూడా బ‌రువు త‌గ్గించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఈ మ‌సాజ్ చేసే స‌మ‌యంలో కొద్దిగా అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయినా మ‌సాజ్‌ను మానేయ‌కూడ‌దు.

4. బొమ్మ‌లో చూపిన విధంగా చెవిపై ఉన్న ఆ పాయింట్‌పై నిత్యం 3 సార్లు 3 నిమిషాల పాటు మ‌సాజ్ చేస్తే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంద‌ట‌. మెట‌బాలిజం పెరిగితే క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌యి బ‌రువు తగ్గుతార‌ట‌.

weight-loss-point-3

5. నాభికి 3 సెంటీమీట‌ర్ల కిందుగా ఉండే పాయింట్ వ‌ద్ద రోజుకు 2 సార్లు 2 నిమిషాల పాటు మ‌సాజ్ చేస్తే జీర్ణ ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంద‌ట‌. ఇది బ‌రువును కూడా తగ్గిస్తుంద‌ట‌. శ‌రీరానికి శ‌క్తిని కూడా ఇస్తుంద‌ట‌.

6. మ‌డిమ‌కు 2 ఇంచులు పైన ఉన్న పాయింట్ వ‌ద్ద రోజుకు 2 సార్లు 1 నిమిషం పాటు మ‌సాజ్ చేస్తే జీర్ణ‌శ‌క్తి వృద్ధి చెందుతుంద‌ట‌. బ‌రువును కూడా తగ్గిస్తుంద‌ట‌.

weight-loss-point-4

7. చిత్రంలో చూపిన విధంగా రొమ్ము కింది భాగంలో రెండు చేతి వేళ్ల‌తో నిత్యం 5 నిమిషాల పాటు మ‌సాజ్ చేస్తే జీర్ణ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. త‌ర‌చూ ఇలా చేస్తే బ‌రువు కూడా తగ్గుతారు. అంతేకాదు అల్స‌ర్లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Comments

comments

Share this post

scroll to top