మనిషి జీవితకాలం ఒకప్పుడు వందేళ్ళు ఉంటే, నేడు 50,60 ఏళ్ళకే మరణానికి దగ్గరవుతున్నాడు. దీనికి కారణం మనిషి తెచ్చుకుంటున్న కొత్త కొత్త అలవాట్లు. ముఖ్యంగా సిగరెట్ స్మోకింగ్, గుట్కాల కారణంగా ఊపిరితిత్తుల వ్యాధితో ప్రతి 10 మందిలో ఒకరు మరణిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం సిగరెట్ అలవాటు ఉన్నవారు కాగా, ముందు ఉన్న ధూమపానం కారణంగా ఈ మరణాల సంఖ్య ఎక్కువైంది. మరి వీటికి పరిష్కారం లేదా అంటే ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ కింద తెలిపిన విషయాలను, ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే మంచిది. ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు కాసింత తోడ్పడుతాయి.
ద్రాక్షపండు:
వారానికి నాలుగుసార్లు ద్రాక్షపండ్లను తీసుకోవడం వలన ధూమపానం అలవాట్లతో బాధపడేవారు, శ్వాస క్యాన్సర్ ప్రమాదం నుండి తప్పించుకునే ప్రమాదం కొంచెమైనా తగ్గుతుంది.

ఉల్లిపాయలు:
ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన ధూమపానం వలన ఊపిరితిత్తులలో చేరుకున్న విషాన్ని శుభ్రం చేస్తుంది.

నీరు:
నీరు ప్రతి ఒక రోగానికి మంచివైద్యంగా చెబుతారు. రోజుకి 8 గ్లాసుల నీటిని తీసుకోవడం వలన శరీరంలో నీరు సమృద్ధిగా ఉంటూ ఊపిరితిత్తులను బాగా పనిచేసేలా చేస్తుంది మరియు శరీరంలోని ఇతర అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి కూడా.

క్యారట్ జ్యూస్:
అల్పాహారం సేవించే ముందు 300 మి.లీ క్యారట్ జ్యూస్ తీసుకోవడం వలన మీ శరీరంలో ఉన్న చెడురక్తాన్ని తీసివేస్తుంది.

అల్లం:
మనం తీసుకునే పాల ఉత్పత్తులు గోధుమలు,సోయాల వలన శ్లేష్మం (చీమురు)ను తొలగించడంలో అల్లం సహాయపడుతుంది.. అలాగే ఇందులొ యాంటీ ఆక్సిడెంట్లు ధూమపానం వలన ఊపిరితిత్తులలో ఉన్నటువంటి విషాన్ని బయటకు పారదోలుతుంది.

హెర్బల్ టీ:
మూలికలైన పుదీనాతో ఉదయాన్నే ఒక గ్లాసు టీ తీసుకోవడం వలన శరీరం చాలా ఉల్లాసంగా పనిచేస్తుంది మరియు పేగులలో చేరుకుపోయిన విషాన్ని బయటకు పంపుతుంది.

పైనాపిల్ జ్యూస్:
డైలీ 300మి.లీ అనాసపండు జ్యూస్ తీసుకోవడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో శ్వాసకోస సంబంధిత వ్యాధుల నుండి బయటపడవచ్చు.

గోరువెచ్చని నిమ్మ నీరు:
గోరు వెచ్చని నీటిలో అల్పాహారం సేవించేముందు రెండు నిమ్మకాయలను ఆ నీటిలో పిండి, ఆ మిశ్రమాన్ని తీసుకోవడం శరీరానికి మంచిది.
