హెయిర్ పిన్‌ల‌ను ఉప‌యోగించి లాక్‌ను ఎలా తెర‌వ‌చ్చో తెలుసా..?

సినిమాల్లో న‌టీ న‌టులు కొన్ని సంద‌ర్భాల్లో డోర్ లాక్‌ను తీసేందుకు హెయిర్ పిన్‌ను వాడుతారు తెలుసుగా..! ఆ… అవును, అదే. వారు అలా పిన్‌ను లాక్‌లో పెట్టి తిప్ప‌గానే డోర్ ఓపెన్ అవుతుంది. అయితే అది సినిమా కాబ‌ట్టి అలా జ‌రుగుతుంది, కానీ సాధార‌ణంగా అది సాధ్యం కాదు, అని చాలా మంది అనుకుంటారు. అయితే మీరు కూడా అలా అనుకుంటే పొరపాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే, మీరు కూడా హెయిర్ పిన్‌ను ఉప‌యోగించి డోర్ లాక్‌ను సింపుల్‌గా ఇలా తీయ‌వ‌చ్చు. అయితే అందుకు ఓ చిన్న ట్రిక్‌ను మీరు చేయాల్సి ఉంటుంది. అదేమిటంటే…

door-lock

ముందుగా రెండు హెయిర్ పిన్స్‌ను తీసుకోండి. వాటిలో ఒక‌దాన్ని రౌండ్‌గా ఉండే వైపు చివ‌రి భాగంలో కొద్దిగా మ‌డ‌వాలి. దీంతో చిన్న‌పాటి ఎల్ షేప్‌లా అది త‌యార‌వుతుంది. అనంత‌రం రెండో పిన్‌ను తీసుకుని దాని రెండు చివ‌ర‌ల‌ను విడ‌దీయాలి. త‌రువాత ఎల్ షేప్‌లో ఉన్న పిన్‌ను లాక్‌లో ఉంచాలి. అనంత‌రం చివ‌ర‌ల‌ను విడ‌దీసిన పిన్‌ను లాక్‌లో పెట్టి చిత్రంలో చూపిన విధంగా లాక్ లీవ‌ర్స్‌ను పైకి లేపుతూ ఉండాలి. దీంతో వాటికి లోప‌ల క‌నెక్ట్ అయి ఉన్న లీవ‌ర్స్ పైకి వెళ్తాయి. ఈ క్ర‌మంలో లాక్ ఓపెన్ అవుతుంది. అంతే.

hair-pins

అయితే పైన చెప్పిన విధానాన్ని చాలా మంది దొంగ‌లు కూడా ఉప‌యోగిస్తార‌నుకోండి. ఈ క్ర‌మంలో అలాంటి వారు చేసే ఇలాంటి ట్రిక్స్ గురించి కూడా మ‌నం తెలుసుకోవాల్సిందే. ( దయచేసి ఈ ట్రిక్ సొంత ఇంటి తాళం తెరవడానికే ఉపయోగించండి…పక్క ఇంటి తాళం తెరవడానికి కాదు.)

(ఇలాంటి వైరల్ ఆర్టికల్స్ ను డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే………..మా వాట్సాప్ నెండర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.)

Bobby-Pin-Lock-Picking

పైన చెప్పిన ట్రిక్‌ను పూర్తిగా తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన వీడియోను కూడా చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top