ఇలా చేస్తే చుండ్రు స‌మ‌స్యకు చెక్ పెట్టే 5 చిట్కాలు.!

కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, అనారోగ్యాలు, కాలాలు మారుతుండ‌డం… వంటి అనేక కార‌ణాల వ‌ల్ల నేడు చాలా మంది చుండ్రు స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. రోజు మార్చి రోజు, ఇంకా ఆ మాట కొస్తే కొంద‌రు రోజూ త‌ల‌స్నానం చేస్తున్నా రెండో రోజుకు చుండ్రు మ‌ళ్లీ వ‌చ్చి ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటిస్తే దాంతో చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు..!

dandruff

1. ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో 1 కప్పు వాటర్ నింపాలి. దాంట్లో 5 చుక్కల టీట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యేలా షేక్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చుండ్రు తొలగిపోతుంది.

2. ఒక పెనం తీసుకుని కాస్త వేడిచేసిన తర్వాత అరకప్పు కొబ్బరినూనె, 1 టేబుల్ స్పూన్ టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. సన్నని మంటపై ఒక నిమిషం వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ ఆయిల్ తో జుట్టు కుదుళ్ల‌ను మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. దీంతో చుండ్రు క్ర‌మంగా తొల‌గిపోతుంది.

3. ఒక కప్పు తీసుకుని అందులో పావు కప్పు యాపిల్ సైడ‌ర్ వెనిగర్, 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా క‌ల‌పాలి. అనంత‌రం జుట్టుకు ప‌ట్టించాలి. కొంత సేపు మ‌సాజ్ చేయాలి. త‌రువాత షాంపూ లేదా కండిష‌న‌ర్‌తో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు శుభ్రం చేసుకుంటే చుండ్రు నివారించుకోవచ్చు.

4. రెండు టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్ తీసుకుని అందులో 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని కుదుళ్ల‌కి బాగా మసాజ్ చేయాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. దీంతో చుండ్రు స‌మ‌స్య పోతుంది.

5. మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ని గిన్నెలో తీసుకోవాలి. అందులో 20 చుక్కల టీట్రీ ఆయిల్ కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి కుదుళ్ల‌కి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూ, కండిషర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top