తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్టు అవుతుంటే ఏం చేయాలో తెలుసుకోండి..!

రోజులో ఎక్కువ భాగం న‌డిచే వారికి, శారీర‌క శ్ర‌మ ఎక్కువగా చేసేవారికి, చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టేవారికి సాధార‌ణంగా తొడ‌లు రాసుకుని మంట పుట్ట‌డ‌మో ఆ ప్ర‌దేశంలో న‌ల్ల‌గా లేదా ఎరుపుగా కంది పోవ‌డ‌మో జ‌రుగుతుంటుంది. దీనికి తోడు ఆ ప్ర‌దేశంలో మంట‌గా, దుర‌ద‌గా కూడా ఉంటుంది. ఎండాకాలంలోనైతే ఇలాంటి ఇబ్బంది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. కొంత మందికి ఏ కాలంలోనైనా ఈ ఇబ్బంది త‌ర‌చూ వ‌స్తూనే ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు, కొంత మంది పురుషుల‌కు కూడా ఈ త‌ర‌హా స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. అయితే అధిక శాతం మంది దీన్ని ఎలా ప‌రిష్క‌రించుకోవాలో తెలియ‌క స‌త‌మ‌తమ‌వుతుంటారు. ఈ క్ర‌మంలో అలాంటి వారి కోసం కింద కొన్ని టిప్స్ ఇవ్వ‌డం జ‌రుగుతుంది. వాటిని పాటిస్తే పైన చెప్పిన స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

chafed-thighs

1. వాజెలిన్ లేదా బాడీ గ్లైడ్ వంటి వాటిని మంట పుడుతున్న ప్ర‌దేశంలో రాస్తే మంట‌తోపాటు, దుర‌ద కూడా త‌గ్గుతుంది. దీనికి తోడు తొడ‌లు రాసుకునే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

2. టాల్కం పౌడ‌ర్‌, రోల్ ఆన్ డియోస్ వంటి వాటిని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే ఆ ఇబ్బంది తొల‌గిపోతుంది. మంట‌, దుర‌ద కూడా త‌గ్గుతాయి. బ‌య‌టికి వెళ్తున్న‌ప్పుడు వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది.

3. మ‌హిళ‌ల‌కైతే స్టాకింగ్స్ వంటి ప్ర‌త్యేక‌మైన దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ధ‌రించడం వ‌ల్ల తొడ‌లు రాసుకునే స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. ఒక చిన్న‌పాటి నాప్‌కిన్ లాంటి ట‌వ‌ల్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్‌ను వేసి ఆ ట‌వ‌ల్‌ను చుట్టి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి. కొంత సేపు ఆగిన త‌రువాత మళ్లీ అలాగే చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. కొద్దిగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తూ ఉన్నా మంట‌, దుర‌ద వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి.

6. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్క‌ల ల‌వంగం నూనెల‌ను తీసుకుని మిశ్రమంగా బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తొడ‌లు రాసుకునే చోట అప్లై చేయాలి. 5 నిమిషాలు ఆగాక వేడినీటితో క‌డిగేయాలి. దీని వ‌ల్ల మంట‌, దుర‌ద వంటివి తగ్గి స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. స్నానం చేసిన త‌రువాత కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని తొడ‌లు రాసుకునే చోట అప్లై చేయాలి. ఆయిల్ పోయింద‌నుకుంటే మళ్లీ కొంత ఆయిల్‌ను తీసుకుని అప్లై చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

8. మంట‌, దుర‌ద‌గా ఉన్న తొడ భాగాల్లో కొద్దిగా కొబ్బ‌రినూనెను రాసినా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

(ఇలాంటి హెల్త్ టిప్స్ డైరెక్ట్ మీ వాట్సాప్ లో చదవాలనుకుంటున్నారా? అయితే మా వాట్సాప్ నెంబర్ 7997192411 అనే నెంబర్ కు START అని మెసేజ్ చేయండి.)

Comments

comments

Share this post

2 Replies to “తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్టు అవుతుంటే ఏం చేయాలో తెలుసుకోండి..!”

  1. sri says:

    Thnq,I’m daily following ur website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top