ఇప్పటి వరకు మీ ఫోన్ ఛార్జింగ్ ను తప్పుగా పెడుతున్నారని మీకు తెలుసా?

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే చాలు, ఫేస్‌బుక్కు పోస్టులు, కామెంట్లు, లైక్‌లు, ట్విట్ట‌ర్ ట్వీట్లు, సెల్ఫీలు, వాట్స‌ప్, ఫేస్‌బుక్ సంభాష‌ణ‌లు, యూట్యూబ్ వీడియోలు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే, వాట‌న్నింటినీ అలా చూస్తుంటే టైమే తెలీదు. అలా గ‌డిచిపోతుంటుంది. అయితే మ‌రి స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీనో అంటారా! అవును, అది కూడా టైం లాగే అయిపోతుంటుంది. చాలా ఫాస్ట్‌గా. మ‌రి దానికి చార్జింగ్ పెట్ట‌రా..? అంటే ఏముంది, రాత్రి ప‌డుకోబోయే ముందు ఛార్జింగ్ పెట్టి, తెల్లారి తీస్తాం, అంటారా..! అయితే అది చాలా రాంగ్‌..! ఎందుకంటే అలా చార్జింగ్ పెట్ట‌డం వ‌ల్ల ఫోన్ బ్యాట‌రీ కొద్ది రోజుల్లోనే డెడ్ అవుతుంద‌ట‌. అంతేకాదు, అస‌లు స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీని ఎప్పుడు చార్జింగ్ పెట్టాలో, ఏం చేయ‌కూడ‌దో, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

phone-battery-charging

స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీలు సాధార‌ణంగా లిథియం-అయాన్‌తో త‌యారైన‌వే ఉంటాయి. అయితే సైంటిస్టులు చెబుతున్న‌దేంటంటే మ‌నం ఎక్కువ‌గా శ్ర‌మ ప‌డితే ఎలా ఒత్తిడికి లోన‌వుతామో, అదేవిధంగా బ్యాట‌రీకి ఎక్కువ సేపు అంటే 100 శాతం చార్జింగ్ అయినా ఇంకా అలా చార్జింగ్ పెట్టే ఉంచితే అందులోని లిథియం-అయాన్ ఒత్తిడికి లోన‌వుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో కొంత కాలానికి అది స‌రిగ్గా ప‌నిచేయ‌ద‌ట‌. దీంతో బ్యాట‌రీ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి 100 శాతం కావ‌డానికి ఒక‌టి, రెండు పాయింట్ల ముందే చార్జింగ్ తీసేయాల‌ట‌. దీంతో బ్యాట‌రీ ఎక్కువ రోజులు వ‌స్తుంద‌ట‌.

అయితే బ్యాట‌రీలో ప‌వ‌ర్ 10 శాతం త‌గ్గ‌గానే చార్జింగ్ పెట్ట‌వ‌చ్చ‌ట‌. అదేవిధంగా 10 శాతం మిగిలి ఉంద‌న్న‌ప్పుడు కూడా ఫోన్‌ను వాడ‌కుండా చార్జింగ్ పెట్ట‌డ‌మే బెట‌ర‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫోన్‌ను కేవ‌లం ఒకేసారి కాకుండా చార్జింగ్ త‌గ్గిన‌ప్పుడ‌ల్లా మ‌ధ్య మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడు చార్జింగ్ పెట్ట‌వ‌చ్చ‌ట‌. దీంతో డివైస్‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఏమీ ఉండ‌ద‌ని వారు చెబుతున్నారు. దీని వ‌ల్ల బ్యాట‌రీ ఎక్కువ కాలం మ‌న్నుతుంద‌ట‌. ఇక చివ‌రిగా ఇంకో విష‌యం ఏమిటంటే ఫోన్‌ను చార్జింగ్ పెట్టిన‌ప్పుడు హీట్ అవుతుంటే దానికి ఉన్న బ్యాక్ ప్యానెల్ లేదా ఫ్లిప్ క‌వ‌ర్‌ను తీసేయాల‌ట‌. దీంతో హీటింగ్ త‌క్కువ‌వుతుంద‌ట‌. అదేవిధంగా సూర్యకాంతిలో ఉన్న‌ప్పుడు డివైస్‌ను చార్జింగ్ చేయాల్సి వ‌స్తే దానిపై ఏదైనా నీడ ఉండేలా క‌వ‌ర్ చేయ‌డం ఉత్త‌మ‌మ‌ని టెక్ నిపుణులు అంటున్నారు. తెలుసుకున్నారుగా, బ్యాట‌రీ చార్జింగ్ గురించిన విష‌యాల‌ను. న‌చ్చితే పాటించండి. దీంతో మీ ఫోన్ బ్యాట‌రీ కూడా ఎక్కువ కాలం వ‌స్తుంది. అంతేగా!

Comments

comments

Share this post

scroll to top