అంద‌మైన క‌నురెప్ప‌లు కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..!

కేవలం తెల్ల‌గా ఉండ‌డం మాత్ర‌మే కాదు. ముఖంలోని అన్ని భాగాలు అందంగా క‌నిపించిన‌ప్పుడే చూడ‌డానికి ఎవ‌రైనా ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డ‌తారు. ఇలా ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డాలంటే ముఖంలో తీర్చిదిద్దుకోవాల్సిన భాగాలు బాగానే ఉన్నాయి. అలాంటి భాగాల్లో చెప్పుకోద‌గిన‌వి క‌నురెప్ప‌ల వెంట్రుక‌లు. అవును, ఈ వెంట్రుక‌లు ఎంత ద‌ట్టంగా నిండుగా ఉంటే కంటి పాప కూడా అంతే అందంగా క‌నిపిస్తుంది. అయితే నేడు అధిక శాతం మంది క‌నురెప్ప‌ల‌కు మేక‌ప్ పెట్ట‌డ‌మో, డూప్లికేట్ క‌నురెప్ప‌ల‌ను త‌గిలించుకోవ‌డ‌మో ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో అలాంటి కృత్రిమ ప‌దార్థాల‌తో ప‌నిలేకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగిస్తూ కంటి రెప్ప‌ల వెంట్రుక‌ల‌ను ఎలా పెంచుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆముదం…
కంటి రెప్ప‌ల వెంట్రుక‌ల‌ను సంర‌క్షించే శ‌క్తి ఆముదం నూనెకు ఉంది. కొద్దిగా నూనెను చిన్న‌పాటి బ్ర‌ష్‌తో తీసుకుని దాంతో క‌నురెప్ప‌లపై సున్నితంగా రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. అనంత‌రం వాటిని తెల్లారాక క‌డిగేయాలి. దీంతో క‌నురెప్ప‌ల వెంట్రుక‌లు ద‌ట్టంగా పెరుగుతాయి.

బాదం నూనె…
కొద్దిగా బాదం నూనెను క‌నురెప్ప‌లపై రాసినా స‌రిపోతుంది. దీంతో అక్క‌డి వెంట్రుక‌ల‌కు ఆరోగ్యం క‌లుగుతుంది. అవి ద‌ట్టంగా పెరుగుతాయి.

oils-for-eyelashes

గ్రీన్ టీ…
కొద్దిగా గ్రీన్ టీని త‌యారు చేసి చ‌ల్లార్చాలి. అనంత‌రం దాన్ని ఒక కాట‌న్ బాల్‌తో క‌నురెప్ప‌ల‌పై నెమ్మ‌దిగా అప్లై చేయాలి. ఇది కూడా క‌నురెప్ప‌ల వెంట్రుక‌ల‌కు పోష‌ణ‌నిస్తుంది. గ్రీన్ టీలోని ఫ్లేవ‌నాయిడ్స్‌, కెఫీన్ వెంట్రుక‌ల పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతాయి.

అలోవెరా జెల్‌…
కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని క‌నురెప్ప‌ల‌పై రాయాలి. రాత్రి పూట ఇలా రాసి వాటిని అలాగే వ‌దిలేయాలి. అనంత‌రం తెల్లారాక క‌డిగేయాలి. ఇది కూడా క‌నురెప్ప‌ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెంట్రుక‌ల పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది.

beautiful-eye-lashes

పైన తెలిపిన చిట్కాలను వాడేవారు కొన్ని సూచ‌న‌ల‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే డూప్లికేట్ క‌నురెప్ప‌ల‌ను వాడ‌వ‌ద్దు. వీటి వ‌ల్ల అస‌లైన క‌ను రెప్ప‌లు త‌మ స‌హజ ఆక‌ర్ష‌ణ‌ను కోల్పోతాయి. మేక‌ప్ ఎక్కువ‌గా వేసుకునే వారు రాత్రి పూట దాన్ని తీసివేయ‌డ‌మే మంచిది. లేదంటే క‌ళ్ల‌పై అది ప్ర‌భావం చూపుతుంది. విట‌మిన్లు, మిన‌రల్స్ ఎక్కువ‌గా ఉండే పండ్లు, కూర‌గాయ‌ల‌ను తింటే ఇంకా మంచి ఫలితం క‌నిపిస్తుంది. క‌నురెప్ప‌ల వెంట్రుక‌ల‌ను చ‌క్క‌ని బ్ర‌ష్‌తో నిత్యం దువ్వుకుంటే అవి ఇంకా ఆక‌ర్ష‌ణ‌ను సొంతం చేసుకుంటాయి. క‌ళ్ల‌ను ఎక్కువ‌గా న‌ల‌ప‌కూడ‌దు. దీని వ‌ల్ల క‌నురెప్ప‌లు త‌మ స‌హ‌జ ఆకృతిని కోల్పోతాయి. క‌ళ్లు మూసుకుని వాటిపై నిత్యం కొంత సేపు మ‌సాజ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు, త‌ద్వారా క‌ను రెప్ప‌ల‌కు ఆరోగ్యం క‌లుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top