దెబ్బ‌లు, గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానాలంటే… ఇలా చేయాలి..!

దెబ్బ‌లు, గాయాల‌నేవి మ‌న‌కు అనుకోకుండా సంభ‌వించే ప్ర‌మాదాల వ‌ల్ల క‌లుగుతాయి. వాటిని ప‌ట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అవి పుండ్లుగా మారి మ‌న‌ల్ని ఇంకా ఇత‌ర అనేక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. అయితే ఏ ప్ర‌మాదం వ‌ల్ల దెబ్బ త‌గిలినా, గాయం అయినా కొంద‌రిలో మాత్రం అవి అంత త్వ‌ర‌గా మాన‌వు. ఈ క్ర‌మంలో అలాంటి వారే కాకుండా ఇత‌రులు కూడా కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే దాంతో గాయాలు, పుండ్ల నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

cuts-wounds-bruises

తేనె…
తేనెలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉన్నాయి. ఇవి సూక్ష్మ‌క్రిముల ప‌ని ప‌ట్ట‌డ‌మే కాదు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి. క‌నుక దెబ్బ‌లు, గాయాలు, పుండ్లు ఉన్న‌వారు వాటిపై త‌రచూ తేనెను రాస్తుంటే దాంతో అవి త‌గ్గిపోతాయి.

ప్రోటీన్లు ఉన్న ఆహారం…
ప‌ప్పు ధాన్యాలు, మాంసం (చికెన్‌, ఫిష్‌, మ‌ట‌న్‌), పాలు, చీజ్‌, గుడ్లు వంటి ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవాలి. దీంతో గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానిపోతాయి. నాశ‌న‌మైన క‌ణ‌జాలం త్వ‌ర‌గా రూపొందేందుకు ఇవి స‌హ‌క‌రిస్తాయి.

పోష‌కాహారం…
విట‌మిన్ ఏ, సీ, ఈలు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి మన శ‌రీరాన్ని ర‌క్షిస్తాయి. క‌నుక ఈ పోష‌కాలు ఉన్న ఆహారం తింటే దాంతో గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఎల‌క్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెర‌పీ…
ఈ ప‌ద్ధ‌తిని ఎక్కువ‌గా క్రీడాకారులు పాటిస్తారు. ఇత‌రులు కూడా అందుబాటులో ఉంటే ఈ విధానాన్ని అనుస‌రించ‌వ‌చ్చు. దీంతో గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. ఎముక‌లు దృఢంగా రూపొందుతాయి.

పొగ తాగ‌డం…
శ‌రీరానికైన గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానాలంటే పొగ తాగ‌డం మానేయాలి. అంతేకాదు, పొగాకు సంబంధ ఉత్ప‌త్తుల‌ను కూడా వాడ‌కూడ‌దు. లేదంటే శ‌రీరంలోని ఔష‌ధ గుణాలు ఇన్‌ఫెక్ష‌న్లపై స‌రిగ్గా పోరాడ‌లేవు.

సిల్వ‌ర్ ఆయింట్‌మెంట్‌…
సిల్వ‌ర్ (వెండి) లోహం యాంటీ ఇన్‌ఫెక్టివ్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. క‌నుక సిల్వ‌ర్ ఉన్న ఆయింట్‌మెంట్ల‌ను వాడితే గాయాలు త్వ‌రగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

చ‌మోమిల్‌…
చ‌మోమిల్ నూనె (మార్కెట్‌లో దొరుకుతుంది)తో చేసిన టీని తాగితే దాంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి.

Comments

comments

Share this post

scroll to top