నడుం నొప్పిని తగ్గించే 8 స్టెప్పులు.

ఎక్కువ సేపు ఒకే భంగిమ‌లో కూర్చోవ‌డం, నిల‌బ‌డి ఉండ‌డం, ప‌నిచేయ‌డం చేస్తే ఎవ‌రికైనా స‌హ‌జంగానే వెన్ను నొప్పి వ‌స్తుంటుంది. అయితే ఇవే కాకుండా కొన్ని ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధుల వ‌ల్ల కూడా వెన్ను నొప్పి క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో అలా క‌లిగే వెన్ను నొప్పిని త‌గ్గించేందుకు అధిక శాతం మంది వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను ఉపయోగిస్తుంటారు. అయితే వాటికి తోడు కింద చెప్ప‌బోయే ప‌లు సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను చేసిన‌ట్ట‌యితే వెన్ను నొప్పి నుంచి విముక్తులు కావ‌చ్చు. ఆ ఎక్స‌ర్‌సైజులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

exercises-for-back-pain-1

1. చిత్రంలో చూపిన విధంగా కింద వెల్ల‌కిలా ప‌డుకుని మోకాళ్ల‌ను పొట్ట పైకి తెస్తూ ఒక్కో కాలుకు ఎక్స‌ర్‌సైజ్ చేయాలి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

2. నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకుని ఒక్కో కాలును పైకి లేపుతూ ఎక్స‌ర్‌సైజ్ చేయాలి. అలా కాలును పైకి లేపిన‌ప్పుడు క‌నీసం 20 సెకండ్ల పాటు అలాగే ఉంచాలి. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను నిత్యం 3 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

3. చిత్రంలో చూపిన విధంగా కాలును మ‌డిచి క‌నీసం 30 సెకండ్ల పాటు ఆ భంగిమ‌లో ఉంటే వెన్ను నొప్పి త‌గ్గుతుంది. ఇలా రెండు కాళ్లకు ఎక్స‌ర్ సైజ్ చేయాలి.

4. బొమ్మ‌లో ఇచ్చిన‌ట్టుగా కాళ్ల‌ను అటు, ఇటు పెడుతూ ఎక్స‌ర్‌సైజ్ చేయాలి. దీంతో వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

exercises-for-back-pain-2

5. ఈ భంగిమ‌లో క‌నీసం 20 సెకండ్ల పాటు ఉండాలి. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను 4,5 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది. దీంతో వెన్నెముక‌కు దృఢత్వం క‌లుగుతుంది.

6. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను 3, 4 సార్లు చేయాలి. బొమ్మ‌లో ఇచ్చిన భంగిమ‌లో క‌నీసం 30 సెకండ్ల పాటు ఉండాలి. దీంతో ఫ‌లితం ఉంటుంది.

7. నేల‌పై ప‌డుకుని ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజుకు 2, 3 సార్లు చేస్తే వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

8. చిత్రంలో ఇచ్చిన విధంగా రెండు వైపుల‌కు స్ట్రెచ్ అవుతూ ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను చేయాలి. దీంతో వెన్ను నొప్పి స‌మ‌స్య త‌గ్గుతుంది.

Comments

comments

Share this post

scroll to top