పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌ర‌గాలా..? అయితే ఈ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను రోజూ చేయండి..!

అధిక బ‌రువు… నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌. కార‌ణాలు ఏమున్నా నేడు స్థూల‌కాయులు పెరిగిపోతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో అధిక శాతం మంది త‌మ శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్ర‌య‌త్నాల‌తోపాటు కింద ఇచ్చిన రెండు సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను రోజూ చేస్తే చాలు. పొట్ట సుల‌భంగా త‌గ్గిపోతుంది. ఆ ఎక్స‌ర్‌సైజులో ఏమిటో ఇప్పుడు చూద్దాం.

tummy-exercise

బైసైకిల్ క్రంచెస్‌…
స‌మ‌త‌లంగా ఉన్న ప్ర‌దేశంపై వెల్ల‌కిలా ప‌డుకోవాలి. చిత్రంలో చూపిన విధంగా చేతుల‌ను త‌ల కింద పెట్టుకోవాలి. ఎడ‌మ కాలును పైకి లేపి దాని మోకాలు పొట్ట‌కు ఆనేలా వెన‌క్కి తేవాలి. అదే క్ర‌మంలో ఎడ‌మ మోకాలుకు కుడి మోచేయి త‌గిలేలా ఒక వైపుకు తిర‌గాలి. అనంత‌రం కుడి కాలు, ఎడ‌మ మోచేయితో అలాగే చేయాలి. ఇలా 15 సార్ల చొప్పున 2 సెట్ల‌లో మొత్తం 30 సార్లు ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ చేయాలి. దీనివ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర కండ‌రాలు దృఢ‌మ‌వుతాయి. పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు కూడా త్వ‌ర‌గా క‌ర‌గ‌డం మొద‌లవుతుంది.

tummy-exercise

హిప్ లిఫ్ట్‌…
స‌మ‌త‌లంగా ఉన్న ప్ర‌దేశంపై వెల్ల‌కిలా ప‌డుకోవాలి. అనంత‌రం రెండు కాళ్ల‌ను పైకి ఎత్తాలి. చేతుల‌ను రెండింటినీ ముందుకు చాచి అర‌చేతులు కింది వైపుకు వ‌చ్చేలా పెట్టాలి. ఇప్పుడు కాళ్ల‌ను మ‌రింత నిటారుగా పెట్టి శ‌రీరం L ఆకారంలోకి వ‌చ్చేలా చూడాలి. ఈ భంగిమ‌లో కొంత సేపు ఉన్న త‌రువాత కాళ్ల‌ను నెమ్మ‌దిగా కింద‌కి దించి నిటారుగా పెట్టాలి. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను కూడా 15 సార్ల చొప్పున 2 సెట్ల‌లో మొత్తం 30 సార్లు రోజూ చేయాలి. దీని వ‌ల్ల న‌డుం ద‌గ్గ‌రి కండ‌రాలు, పొట్ట దృఢ‌మ‌వుతాయి. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగి న‌డుం స‌న్న‌గా, నాజూకుగా మారుతుంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top