మీ ముక్కు లావుగా, వంక‌ర టింక‌ర‌గా ఉందా..? ఇలా చేస్తే ఫర్ఫెక్ట్ అవుతుంది.

ఎవ‌రైనా వ్య‌క్తిని చూసిన‌ప్పుడు మీరు మొద‌ట‌గా వారిలో చూసేది ఏమిటి..? ఎవ‌రైనా ఏం చూస్తారు, ముందుగా ముఖం చూస్తారు. అంతే క‌దా..! అంటారా..? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే. కానీ ముఖంలో ఎలాంటి లోపం లేకుండా అంతా స‌వ్యంగా ఉంటే, అబ్బా ఎంత బాగున్నారో అనుకుంటారు. అదే ఏదో ఒక లోపం ఉంటే..? ప‌్ర‌ధానంగా ముక్కునే తీసుకోండి. అదే కొంచెం, వంక‌ర టింక‌ర‌గా, లేదంటే పెద్ద‌గా ఉంటే..? అప్పుడు ఏమ‌నుకుంటారు..? అబ్బా..! అదేంటీ, అత‌ని ముక్కు అలా ఉంది, ఆమె ముక్కు అంత పెద్ద‌గా ఉందేంటీ..! అని దాదాపుగా ఎవ‌రైనా మ‌న‌స్సులోనే అనుకుంటారు. అయితే మీకు తెలుసా..?  ముఖానికి అందాన్ని తేవ‌డంలో ముక్కు కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుందని. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ క్ర‌మంలో ముక్కును ప‌ర్‌ఫెక్ట్ షేపులోకి తెచ్చుకోవాలంటే కింద ఇచ్చిన ప‌లు సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను ముక్కుతో చేయండి చాలు. దీంతో మీ ముక్కు చ‌క్క‌ని ఆకృతిని పొందుతుంది.

nose-exercise-1
1. ముక్కుకు రెండు వైపులా చూపుడు వేలితో మ‌ర్ద‌నా చేస్తూ ముక్కుతో గాలిని బ‌య‌ట‌కు బ‌లంగా వ‌ద‌లాలి. ఈ క్రమంలో ఒక్కోసారి ముక్కు కింద వైపు ప‌క్క భాగంలోనూ మ‌సాజ్ చేయ‌వ‌చ్చు. దీంతో మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను నిత్యం 10 సార్లు చేయాలి.

2. ముక్కు చివ‌రి భాగంపై చూపుడు వేలితో ప్రెస్ చేసి అలాగే ప‌ట్టుకోవాలి. అనంత‌రం ముక్కును పెద్దదిగా చేస్తూ వేలిపై ఒత్తిడి క‌లిగించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముక్కు చ‌క్క‌ని ఆకృతిని పొందుతుంది. నిత్యం దీన్ని 10 సార్లు చేయ‌వ‌చ్చు.

3. రెండు వేళ్ల‌తో ముక్కును పట్టుకుని పైకి జ‌ర‌పాలి. అనంత‌రం చిన్న‌గా న‌వ్వాలి. దీంతో ముక్కు కండ‌రాలు వృద్ధి చెందుతాయి. ముక్కు చ‌క్కని షేప్‌ను కూడా పొందుతుంది. దీన్ని రోజూ 20 నుంచి 30 సార్లు చేయాల్సి ఉంటుంది.

nose-exercise-2
4. నేల‌పై పూర్తి విశ్రాంత స్థితిలో కూర్చోవాలి. ముక్కు ఒక రంధ్రాన్ని వేలితో మూసి మ‌రో రంధ్రంతో శ్వాస పీల్చాలి. అనంత‌రం శ్వాస పీల్చిన రంధ్రాన్ని మూసి, మూసి ఉన్న రంధ్రాన్ని తెర‌చి శ్వాస వ‌ద‌లాలి. ఇలా రోజుకు క‌నీసం 30 సార్లు చేయాలి. దీంతో ముక్కు చ‌క్క‌ని ఆకృతిని సొంతం చేసుకుంటుంది.

5. ఇప్పుడు చెప్ప‌బోయే ఎక్సర్‌సైజ్‌ను రోజులో ఎన్ని సార్ల‌యినా చేయ‌వ‌చ్చు. అదేమిటంటే, ముక్కును పైకి కింద‌కి గానీ, ప‌క్క‌ల‌కు గానీ, వేగంగా క‌దిలిస్తూ ఉండాలి. ఈ స‌మ‌యంలో ముఖంలోని ఏ భాగాలు క‌ద‌ల‌కుండా చూసుకోవాలి. అయితే కొంద‌రికి ఇది సాధ్యం కాదు. కానీ ప్ర‌య‌త్నిస్తే ఫ‌లితం ఉంటుంది.

6. ముక్కు మొత్తాన్ని రోజుకు క‌నీసం 5 సార్లు మ‌ర్ద‌నా చేయాలి. ప్ర‌తి భాగాన్ని సున్నితంగా ప్రెస్ చేస్తూ వ‌ల‌యాకారంలో ఎక్స‌ర్‌సైజ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల లావు ముక్కు స‌న్న‌గా మారుతుంది.

Comments

comments

Share this post

scroll to top