బెలూన్ తో…మీ సెల్ ఫోన్ బ్యాక్ కవర్ ను మీరే స్వయంగా తయారు చేసుకోండిలా…!

స్మార్ట్‌ఫోన్లు నేడు మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కు వాటిని మ‌నం వ‌ద‌ల‌డం లేదు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్‌, ఇన్‌స్టాంట్ మెసెంజ‌ర్స్‌, ఇంట‌ర్నెట్‌, సెల్ఫీలు… ఇలా అనేక ర‌కాల ప‌నుల‌ను మ‌నం వాటితో చేసుకుంటున్నాం. అయితే స్మార్ట్‌ఫోన్ల‌ను ఎవ‌రైనా వాటిని ఫోన్ల‌లాగే ఉప‌యోగిస్తారు. కానీ వాటితో ట్రిక్స్ చేసి ఎవరూ వాటిని వాడ‌రు. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ప‌లు ట్రిక్స్ తెలుసుకుంటే దాంతో స్మార్ట్‌ఫోన్‌ను మ‌రింత బాగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ట్రిక్స్ చేసేందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సింది కూడా ఏమీ లేదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

phone-stylus

1. చాలా స్మార్ట్‌ఫోన్ల‌కు ఇప్పుడంటే స్టైలస్ (ట‌చ్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డే పెన్ను లాంటి ప‌రిక‌రం) లేదు కానీ, ఒక‌ప్పుడు స్మార్ట్‌ఫోన్లు కొత్త‌గా వ‌చ్చిన‌ప్పుడు స్టైల‌స్‌లు ఉండేవి. అయితే మీ ఫోన్‌కు స్టైల‌స్ లేకున్నా మీరే స్వ‌యంగా దాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఏం లేదు, ఓ పెన్సిల్‌ను తీసుకుని సింపుల్‌గా దానికి ఓ అల్యూమినియం ఫాయిల్‌ను చుట్టేయండి. దీంతో అది ఫోన్ స్టైల‌స్‌లా త‌యార‌వుతుంది. దాన్ని మీరు ఫోన్‌తో ఎంచ‌క్కా ఉప‌యోగించుకోవ‌చ్చు.

smart-phone-lamp

2. స్మార్ట్‌ఫోన్‌కు ఉండే ఫ్లాష్ లైట్ వెలుగు స‌రిపోవ‌డం లేదా..? అయితే ఏం లేదు. ఫోన్‌ను బోర్లించి ఆ లైట్‌పై సింపుల్‌గా వాట‌ర్ ఉన్న ఓ బాటిల్‌ను పెట్టేయండి. దీంతో వెలుతురు ఎక్కువ‌గా వ‌స్తుంది.

camera-drop

3. డీఎస్ఎల్ఆర్ కెమెరాల కంటే జూమ్ ఉంటుంది కాబ‌ట్టి దాంతో ఎంత దూరంలో ఉన్న ఫొటోల‌ను తీసినా బాగా క్లియర్‌గా వ‌స్తాయి. కానీ స్మార్ట్‌ఫోన్‌కు అలా కాదుగా, అందులో ఉండే డిజిట‌ల్ జూమ్‌తో ఫొటోలు తీస్తే అవి ప‌గిలిపోయి వ‌స్తాయి. ఈ క్ర‌మంలో ఫోన్‌కు ఆప్టిక‌ల్ జూమ్ వ‌చ్చేలా చేయాలంటే అందుకు ఓ ట్రిక్ ఉంది. అదేంటంటే ఫోన్ కెమెరాపై ఓ చిన్న నీటి బిందువు వేయండి. ఒక్క‌టంటే ఒక్క‌టే బిందువు వేసి ఫొటో తీయండి. దీంతో జూమ్ ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌స్తుంది.

phone-baloon

4. స్మార్ట్‌ఫోన్ బ్యాక్ క‌వ‌ర్ విరిగి పోయిందా..? అయితే ఏం ఫ‌ర్వాలేదు. ఓ బెలూన్‌ను బాగా ఊది దానిపై మీ స్మార్ట్‌ఫోన్‌ను పెట్టేయండి. అనంత‌రం బెలూన్‌లోని గాలిని నెమ్మ‌దిగా వ‌ద‌లండి. దీంతో బెలూన్ స్మార్ట్‌ఫోన్ చుట్టూ బ్యాక్ క‌వ‌ర్‌లా వ‌చ్చేస్తుంది.

loud-speaker

5. ఫోన్‌లో లౌడ్ స్పీక‌ర్ ద్వారా పాటలు వింటున్న‌ప్పుడు సౌండ్ ఎక్కువ‌గా రావ‌డం లేదా..? అయితే ఫోన్ స్పీక‌ర్ కింద వైపుకి వచ్చేలా దాన్ని ఓ ఖాళీ గాజు గ్లాస్‌లో వేయండి. అంతే, సౌండ్ పెరిగిపోతుంది.

sound-system

6. స్మార్ట్‌ఫోన్‌కు ప్ర‌త్యేకంగా సౌండ్ సిస్ట‌మ్ కావాలంటే రెండు పేప‌ర్ గ్లాసుల‌ను తీసుకుని వాటిని చిత్రంలో చూపిన విధంగా ఓ కార్డ‌బోర్డ్ గొట్టంతో క‌ల‌పాలి. ఆ గొట్టానికి మ‌ధ్య‌లో ఫోన్ ప‌ట్టేంత రంధ్రం చేసి అందులో ఫోన్ స్పీక‌ర్ వ‌చ్చేలా అమ‌ర్చాలి. అంతే, మీ ఫోన్‌కు సౌండ్ సిస్ట‌మ్ త‌యార‌వుతుంది.

charger

7. ఇది చాలా మందికి ఎదురయ్యే స‌మ‌స్యే. చార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఫోన్‌ను ఉంచ‌డానికి స‌రైన ప్ర‌దేశం ఉండ‌దు. అయితే బొమ్మ‌లో ఇచ్చిన విధంగా ఓ షాంపూ లేదా ఆయిల్ బాటిల్‌ను క‌ట్ చేసి పెట్టుకోవ‌చ్చు.

clip-rice

8. మ‌హిళ‌లు త‌మ జుట్టుకు ధ‌రించే హెయిర్ క్లిప్‌ను ఫోన్‌కు పెడితే చాలు అది ఎలాంటి స‌పోర్ట్ లేకున్నా అలాగే ఉంటుంది. దీంతో ఫోన్‌లో వీడియోలు, సినిమాల‌ను ఎంచ‌క్కా వీక్షించ‌వ‌చ్చు.

9. మీ ఫోన్ బాగా త‌డిసిపోయిందా..? అయితే ఏం లేదు, ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్ నిండుగా బియ్యం పోసి అందులో త‌డిసిన మీ ఫోన్‌ను వేయండి. అనంత‌రం క‌వ‌ర్ మూతి క‌ట్టేయండి. కొంత సేప‌టికి బియ్యం ఫోన్‌లో ఉన్న త‌డినంతా పీల్చేసుకుంటుంది. త‌రువాత ఓపెన్ చేస్తే ఫోన్‌ను ఎంచ‌క్కా వాడుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top