ఇత‌రుల పేరు మీద సిమ్ తీసుకుని వాడుతున్నారా..? దాన్ని మీ పేరు మీద‌కు మార్చుకోండి ఇలా..!

ప్ర‌జ‌లు తాము వాడుతున్న ఫోన్ నంబ‌ర్ల‌ను త‌మ త‌మ ఆధార్ నంబ‌ర్ల‌తో అనుసంధానం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకు గాను ఫిబ్ర‌వరి 6, 2018వ తేదీ వ‌ర‌కు గ‌డువు కూడా ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ ఫోన్ నంబ‌ర్ల‌ను ఆధార్‌తో లింక్ చేస్తున్నారు. అయితే మ‌నం గ‌తంలో మ‌న పేరు మీద తీసుకున్న ఫోన్ నంబ‌ర్ల‌నైతే సింపుల్‌గా ఆధార్‌తో సీడ్ చేయ‌వ‌చ్చు. ఎందుకంటే అవి మ‌న పేరు మీదే ఉంటాయి, ఆధార్‌లోనూ మ‌న పేరు ఉంటుంది క‌నుక అవి సుల‌భంగా లింక్ అవుతాయి. అయితే మ‌రి కొంద‌రు ఇత‌రుల పేరు మీద తీసుకున్న సిమ్‌ల‌ను వాడుతుంటారు. మ‌రి అవి ఎలా..? అంటే.. అవును, అందుకు కూడా మార్గం ఉంది. అదేమిటంటే…

ఇత‌రుల పేరు మీద తీసుకున్న సిమ్‌ను వాడేవారు ఆ వ్యక్తికి చెందిన ఆధార్ జిరాక్స్‌, అడ్ర‌స్‌, ఐడీ ప్రూఫ్‌లు (ఏవి ఉంటే అవి) తీసుకుని స‌ద‌రు సిమ్ కంపెనీకి చెందిన సమీప స్టోర్‌కు వెళ్లాలి. అవ‌స‌రం అనుకుంటే ఆ వ్య‌క్తిని స్టోర్‌కు వెంట తీసుకెళ్ల‌వ‌చ్చు. అక్క‌డే ఫోన్ నంబ‌ర్ ఎక్స్‌ఛేంజ్ ఫాం ఇస్తారు. అందులో ఆ వ్య‌క్తి వివ‌రాలు, మీ వివ‌రాలు ఎంట‌ర్ చేసి ఇద్ద‌రి ప్రూఫ్ లు ఇవ్వాలి. దీంతో స్టోర్ వారు మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు సిమ్ మీ పేరు మీద‌కు మార్చ‌బ‌డుతుంది. అందుకు గ‌రిష్టంగా 7 నుంచి 15 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు.

అయితే ఇలా సిమ్ బ‌దిలీ చేసే విష‌యంలో స‌ద‌రు నెట్‌వ‌ర్క్ కంపెనీకి ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే వారు సిమ్ నంబ‌ర్‌ను మీ పేరు మీద‌కు మార్చ‌క‌పోవ‌చ్చు. అలా గ‌న‌క జ‌రిగితే అందుకు త‌గిన కార‌ణాన్ని మీరు ఆ కంపెనీ నుంచి కోర‌వ‌చ్చు. వారు ఆ కార‌ణానికి చెందిన స‌మాచారాన్ని మీకు మెయిల్ పంపుతారు. ఆ స‌మాచారాన్ని అదే నెట్‌వ‌ర్క్‌కు చెందిన నోడ‌ల్ అధికారికి తెలియ‌జేసి కంప్లెయింట్ ఇవ్వ‌వ‌చ్చు. దాంతో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. అప్పుడు మళ్లీ సిమ్ బ‌ద‌లాయింపు రిక్వెస్ట్ పెట్టుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top