ది బెస్ట్ వీడియో-2015 అని, ఈ వీడియో కు యూట్యూబే కితాబిచ్చింది!

యూట్యూబ్ లో నాలుగేళ్ల చిన్నారి తన ఫర్ఫార్మెన్స్ తో అందరి చేత వావ్ అనిపిస్తుంది. ప్రముఖ ర్యాపర్ సైలెంటో పాడిన’వాచ్ మీ’ పాటకు తన నృత్య బృందంతో కలసి హెవెన్ కింగ్ అనే ఆ చిన్నారి చేసిన డ్యాన్స్ అదిరిపోతోంది. ఇప్పటివరకు ఆ వీడియోను 11.6 కోట్ల మందికి పైగా వీక్షించారని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. అంతేగాక, ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వీక్షించిన వీడియోల్లో ఇది మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దాంతో’ మినీ బియాన్స్’గా పిలుచుకునే న్యూయార్క్ కు చెందిన ఈ చిన్నారి యూట్యూబ్ యువరాణి అయింది. ఈ వీడియో తరువాతి స్థానంలో నటుడు లియోన్ నీసన్ నటించిన ‘క్లాష్ ఆఫ్ క్లాన్స్’ అనే వీడియోను 83 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Watch Video: 

Comments

comments

Share this post

scroll to top