ప్రభుత్వ కార్యక్రమాల్లో వాటర్ బాటిల్స్ వాడడాన్ని నిషేద్దించిన సిక్కిం రాష్ట్రం.

ప్రభుత్వ కార్యక్రమాల్లో వాటర్ బాటిల్స్ , పేపర్ ప్లేట్స్, స్పూన్స్ , కప్స్ ల్లాంటి  ప్లాస్టిక్ వస్తువులు వాడడాన్ని నిషేదిస్తూ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని తీసుకుంది.ఈ ప్లాస్టిక్ కారణంగా అక్కడి వాతావరణం మొత్తం కలుషితం అవుతుండంతో… సిక్కిం గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి నుండి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏ కార్యక్రమంలో కూడా ప్లాస్టిక్ కు సంబంధించిన వస్తువులు ఉపయోగించరు.  ఫ్లాస్టిక్ వాడకాన్ని ప్రజలలో తగ్గించాలంటే ముందు తాము ఆచరించాలని తలచి…మొదటగా తమ నుండే ప్రక్షాళన చేపట్టారు. సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు.  మితిమీరిన ప్లాస్టిక్ వాడడం వల్ల వాతావరణం కలుషితం అవ్వడం., సంవత్సరాల తరబడి కూడా ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోకపోవడం…వీటి కారణంగా వాతావరణంలో మార్పులు, విపరీతమైన వరదలకు కూడా ఆస్కారం ఉండడంతో…సిక్కిం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

PB4016959@A-worker-uses-a-r-750x500

ఈ నిర్ణయంతో…అక్కడి ప్రజల్లో ఎటువంటి మార్పు వస్తుందో చూడాలి. వాస్తవానికి నేడు ప్లాస్టిక్ వినియోగం చాలా పెరిగిపోయింది. మన దగ్గర కూడా  40 మైక్రాన్స్ కన్నా తక్కువున్న ప్లాస్టిక్ కవర్ల  వాడకం పై నిషేదం ఉంది. అయినప్పటికీ ఆ నిషేదాన్ని అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు… ఈ విషయంలో మనం కూడా మారాల్సిన అవసరం ఉంది.. ప్రతి దానికి కవర్…కవర్ అని అడిగే ముందు సరుకులకు వెళ్లేప్పుడు ఇంటి నుండే ఓ సంచిని తీసుకెళ్లడం, కవర్ల వినియోగాన్ని తగ్గించడం లాంటివి చేస్తే….మన భూమాతను మనం రక్షించుకున్నట్లే…అలా కాకుండా మన ఇష్టానుసారం ప్రవర్తస్తే…భూకంపాల ప్రతాపానికి గురికాక తప్పదు.

మంచి నిర్ణయం తీసుకున్న సిక్కిం ప్రభుత్వానికి అభినందనలు.

Comments

comments

Share this post

One Reply to “ప్రభుత్వ కార్యక్రమాల్లో వాటర్ బాటిల్స్ వాడడాన్ని నిషేద్దించిన సిక్కిం రాష్ట్రం.”

  1. Kameshwara Rao Polisetty says:

    Really great decision, rest of the states also should take this as a role model, and start implement the same, this is need of the hour.
    My best wishes to Sikkim Government.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top