“బాహుబలి – 2” లో మరో “రానా”…లుక్ లోనే కాదు ఫిజిక్ లో కూడా! ఇంతకీ అతనెవరో తెలుసా?

“బాహుబలి” ఈ చిత్రం ప్రపంచానికి తెలుగు సినిమా పరిశ్రమను పరిచయం చేయటమే కాదు “ప్రభాస్, రానా” లకు కూడా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. “దగ్గుబాటి” కుటుంబం నుండి వచ్చిన “రానా” తనదైన శైలిలో సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడు. “బాహుబలి” లో “భల్లాలదేవ” గా చేసే బెస్ట్ విలన్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ పాత్రకోసం రానా ఎంతో కష్టపడ్డాడు. జిం లోనే ఎక్కువ సేపు ఉండేవాడు అట.


“ఘాజి” హిట్ తో మంచి ఊపు మీదున్న “రానా” “బాహుబలి – 2 ” తో మరింత మెప్పించనున్నాడు అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాము. ఒకోసారి డూప్ హీరోలతో సినిమాలో కొన్ని సన్నివేశాలు తీస్తుంటారు. మరికొన్ని సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించి ఒకే మనిషిని రెండు పాత్రల్లో చూపిస్తూ ఉంటారు.
కానీ బాహుబలి – 2 లో అలా కాదు.

అచ్చు “రానా” లాగే ఉండే “సిద్ధార్థ్ నాయుడు” అనే అతను బాహుబలి లో నటించనున్నాడు. అతను “బాహుబలి” ఆడిషన్స్ కి మొదటిసారి వెళ్ళినప్పుడు ఎంచుకోలేదు అట. తరవాత రానా లాగ బాడీ పెంచి, స్టైల్ మార్చి “బాహుబలి -2 ” ఆడిషన్స్ కి వెళితే అతనిని సెలెక్ట్ చేసారు. ఇప్పుడు అతను బాహుబలి – 2 లో కనిపించనున్నాడు. అతను ఎలా ఉన్నదో, జిం లో ఎలా వర్క్ చేస్తున్నాడు ఒక లుక్ వేసుకోండి!

ఇప్పుడు “భల్లాలదేవ” సంగతి పక్కన పెట్టి “ప్రభాస్” డూప్ గా కూడా ఒకరు ఆక్ట్ చేసారు. పైనుండి దూకే కొన్ని షాట్స్ లో కనిపించేది ఇతనే..!!

 

Comments

comments

Share this post

scroll to top