SRH ఫాస్ట్ బౌలర్ సిద్దార్థ్ కౌల్…బౌలింగ్ కు వచ్చిన ప్రతిసారీ తన తలకు ఎర్రటి బ్యాండ్ ను ధరించి బౌలింగ్ చేయడం మనం ఈ IPL చూశాం…చాలా మంది అది తన సెంటిమెంట్ అనుకున్నారు. ఇదే డౌట్ ను ఓ అభిమాని డైరెక్ట్ గా సిద్దార్థ్ నే ట్విట్టర్ లో అడిగాడు. మీ తలకు బ్యాండ్ ధరించడం వెనుక కారణమేంటని…ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు సిద్దార్థ్ కౌల్…”హెడ్‌బ్యాండ్‌లో ఎలాంటి మ్యాజిక్ లేదు, కేవలం నేను నా కష్టాన్ని ,మాత్రమే నమ్ముకున్నాను. విజయం సాధించాను. అంతే తప్ప వేరే ఏమీ లేదు. హెడ్‌బ్యాండ్ పెట్టుకోవడం స్టైల్ కోసమే ఐపీఎల్‌లోకి వచ్చినప్పటి నుంచి అదో ట్రేడ్‌మార్కుగా మారింది. అది పెట్టుకుంటే వికెట్లు పడతాయన్న దాంట్లో ఎలాంటి నిజం లేదు”.అని సమాధానమిచ్చారు!
IPL-2018 లో సిద్దార్థ్ చాలా మంచి ప్రతిభ కనబర్చారు. 17 మ్యాచెస్ ఆడిన కౌల్ 3-23 తన బెస్ట్ తో 21 వికెట్లను సాధించాడు.IPL-2018 లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్స్ లో కౌల్ మూడవ స్థానంలో ఉన్నారు.