ఏటీఎం స్లిప్‌లు, సూప‌ర్ మార్కెట్ బిల్ పేప‌ర్లు, ర‌శీదులు ద‌గ్గ‌ర పెట్టుకుంటున్నారా..? అయితే ఏమ‌వుతుందో తెలుసా..?

ఆడ‌, మ‌గ ఇద్ద‌రిలో వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ శృంగార కోరిక‌లు, దానిపై వాంఛ, సామ‌ర్థ్యం త‌గ్గ‌డం మామూలే. అయితే ఆడ‌వారిలో ఇది ముందుగానే క‌నిపిస్తుంది. మ‌గ‌వారిలో కొంత ఆల‌స్యంగా ఇది జ‌రుగుతుంది. కేవ‌లం వ‌య‌స్సు వల్లే కాదు, నిత్యం ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘ‌కాలికంగా ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు… ఇత‌ర‌త్రా కారణాల వ‌ల్ల కూడా ఆడ‌, మ‌గ వారిలో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతూ ఉంటుంది. ఇవి అంద‌రికీ తెలిసిన విష‌యాలే. అయితే ఆ సామ‌ర్థ్యం త‌గ్గానికి ఇంకో కార‌ణం కూడా ఉంది. అదేమిటంటే… ఏటీఎం స్లిప్‌లు, సూప‌ర్ మార్కెట్ల‌లో ఇచ్చే ర‌శీదులు..!

అవును… ఏటీఎంల‌లో వ‌చ్చే స్లిప్‌ల‌తోపాటు సూపర్ మార్కెట్లు, మాల్స్ వంటి వాటిలో ఏవైనా కొన్న‌ప్పుడు ఇచ్చే బిల్ ర‌శీదుల వల్ల కూడా ఆడ‌, మ‌గ వారిలో శృంగార స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. ముఖ్యంగా మ‌గ‌వారిలో అంగ స్తంభ‌న, శృంగార సామ‌ర్థ్యం పూర్తిగా త‌గ్గిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు, ప‌లువురు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలిన నిజం. ఇంత‌కీ అవే ఎందుకు ఆ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయంటే, ఆ స్లిప్‌ల‌కు చెందిన పేప‌ర్‌, వాటిపై ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ వ‌ల్ల ఆ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌.

స‌ద‌రు స్లిప్‌ల‌లో వాడే కాగితంతోపాటు, వాటిపై అక్ష‌రాలను ప్రింట్ చేసేందుకు ఉప‌యోగించే ఇంకులో బిస్ఫెనాల్-ఎ అనే ర‌సాయ‌నం ఎక్కువ‌గా క‌లుస్తుంద‌ట‌. దీని వ‌ల్లే పురుషుల్లో అంగ స్తంభ‌న స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. అంతేకాదు, వారిలో ఆ ర‌సాయ‌నం వ‌ల్లే శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ట‌. దీన్ని ఇటీవ‌లే ప‌రిశోధ‌న‌లు చేసిన కొంద‌రు సైంటిస్టులు బ‌య‌ట పెట్టారు. క‌నుక మీరు కూడా అలాంటి స్లిప్‌ల‌ను తెస్తున్న‌ట్ట‌యితే వాటిని జేబులో పెట్టుకోకండి. కావాలంటే ప‌ర్సులో పెట్టుకుని ఇంటికి చేరుకోగానే వేరే ఏదైనా బాక్స్‌లో వేసేయండి. వాటిని తాకాక చేతుల‌ను కూడా శుభ్రంగా క‌డుక్కోండి. లేదంటే ఏం జ‌రుగుతుందో ముందే చెప్పాం క‌దా..! ఆ త‌రువాత బాధ‌ప‌డీ ప్ర‌యోజ‌నం ఉండదు.

Comments

comments

Share this post

scroll to top