చాలా రోజుల తర్వాత “సిద్ధార్థ్” గృహంతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): గృహం (Gruham)

Cast & Crew:

  • నటీనటులు: సిద్ధార్థ్, ఆండ్రియా, అనీషా వి తదితరులు
  • సంగీతం: గిరీష్
  • నిర్మాత: సిద్ధార్థ్
  • దర్శకత్వం: మిళింద్ రావ్

Story:

కృష్ణ (సిద్ధార్థ్) ఓ న్యూరో సర్జన్, బ్రెయిస్ స్టిమ్యులేషన్ లో స్పెషలిస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకొన్న లక్ష్మీ (ఆండ్రియా)తో కలిసి హిమాలయాస్ దగ్గర్లో నివసిస్తుంటారు. సంతోషంగా జీవిస్తున్న వారి ఇంటిపక్కన ఉన్న మరో బంగ్లాలోకి వస్తారు డాక్టర్ పాల్ (అతుల్ కులకర్ణి) అండ్ ఫ్యామిలీ. మొదట్లో అంతా సరదాగానే ఉంటుంది. కానీ.. ఉన్నట్లుండి పాల్ కూతురు జెన్నీ (అనీషా విక్టర్) వింతగా బిహేవ్ చేయడం మొదలెడుతుంది. మొదట్లో ఆమె కావాలనే అలా చేస్తుందనుకొంటాడు సైక్రియార్టిస్ట్ ప్రసాద్ (సురేష్). కానీ.. ఒక ఫేక్ ఎగ్జార్సిజమ్ నిర్వహిస్తుండగా.. జెన్నీ బాడీలో వేరే ఆత్మ ఉందని గ్రహించి.. ఆ ఆత్మ ఎవరు? జెన్నీ బాడీలోకి ఎందుకు ప్రవేశించింది? అనే విషయాలు కనుక్కోవడం కోసం ప్రయత్నాలు మొదలెడతారు కృష్ణ & ప్రసాద్. ఈ క్రమంలో వారికి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. వాటి ఆధారంగా కాపాడాల్సింది జెన్నీని కాదు కృష్ణని అని తెలుసుకొంటారు. అసలు జెన్నీ బాడీలో ప్రవేశించిన ఆత్మకి కృష్ణకి సంబంధం ఏమిటి? అసలు ఈ ఆత్మల వెనుక ఉన్న కథ ఏమిటి? అనేది “గృహం” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విశేషాలు.

Review:

హారర్ చిత్రాలన్నా, దెయ్యాలన్నా కామెడీగా మారుతున్న క్రమంలో పక్కాగా హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం గృహం. ముఖ్యంగా హారర్ సినిమా అని చెప్పి హాస్యాన్ని అపహాస్యం చేస్తూ, ద్వందార్థాలతో రోత పుట్టిస్తున్న సమయంలో హారర్ సినిమా అంటే ఇది అనే భ్రమను కలిగిస్తుంది గృహం. ఈవిల్ డెడ్ లాంటి హాలీవుడ్ చిత్రాన్ని గుర్తుకు విధంగా గృహం ఉంటుంది. స్కిప్ట్‌లో నిజాయితీ, టేకింగ్‌లో అంకితభావం, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలాంటి అంశాలు గృహం చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. నిజమైన హారర్, థ్రిల్లర్ చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు 100 శాతం మంచి అనుభూతిని పంచుతుందనే గ్యారంటీ గృహం కల్పిస్తుంది. లి భాగంలో సిద్ధార్థ్, ఆండ్రియా రొమాంటిక్ లైఫ్‌ను చాలా సెన్సిటివ్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ పాత్రల పరిచయం జరుగుతుంది. బ్రెయిన్ సర్జర్‌గా సిద్ధార్థ్ పాత్ర ఏమిటి అనే విషయాన్ని చకచకా చెప్పి ముగించేశాడు. సీనియర్ నటుడు సురేష్ సైక్రియాటిస్ట్ పాత్రను ఇంట్రడ్యూస్ చేసి కథకు ఏ విధంగా ఉపయోగపడునున్నాడో అనే హింట్ ఇవ్వడం జరుగుతుంది. తొలిభాగంలో అనిషా నటన, ఆమె చూపించిన హావభావాలు సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ఓ చక్కటి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వడంతో సినిమా రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది. రెండో భాగంలో సిద్ధార్థ్, అతుల్ కులకర్ణి, సురేష్, ఆండ్రియా ఇతర పాత్రలు బిహేవ్ చేసే విధానం సినిమాకు ప్రాణంగా నిలిచాయి. చివరి 20 నిమిషాల సినిమాలో సిద్ధార్థ్ నటన ఆయన ప్రతిభకు అద్ధం పట్టింది. లవర్ బాయ్‌గానే చూసిన ప్రేక్షకుడికి సిద్ధార్థ్‌లో ఈ కోణం కూడా ఉందా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. సిద్ధార్థ్ టాలెంట్‌కు గృహం చిత్రం ఓ గీటురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Plus Points:

  • సిద్ధార్థ్, అండ్రియా, అనిషా నటన
  • కథ, కథనం
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

Final Verdict:

హారర్ సినిమా అనగానే “ఓ ఇల్లు, ఓ దెయ్యం, హీరోయిన్ కి దెయ్యం పట్టడం, హీరో కాపాడడం, మధ్యలో కామెడియన్లను దెయ్యం ఉతికారేయడం” అనే రెగ్యులర్ ఫార్మాట్ ను చూసి చూసి విసిగిపోయిన తెలుగు ప్రేక్షకుడికి ఒక రియలిస్టిక్ హారర్ ఎక్స్ పీరియన్స్ ను కలిగించే చిత్రం “గృహం”. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఒక ప్యూర్ హారర్ సినిమా చూడాలని ఆశపడే ప్రతి ప్రేక్షకుడు తప్పకుండా చూడాల్సిన సినిమా “గృహం”.

AP2TG Rating: 3 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top