నీ భ‌ర్త‌ను విడిచిపెట్టాలంటే రాత్రికి నాతో గ‌డుపు అని చెప్పిన S.I ను ఇంటికి పిలిపించి మ‌రీ….ACB అధికారుల‌కు అప్ప‌గించింది!!

మత్తుమందును క‌లిగి ఉన్న‌డ‌నే కార‌ణంతో ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేశారు రాజ‌స్థాన్ పోలీసులు. త‌న భ‌ర్త‌ను విడిపించుకుందామ‌ని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన స‌ద‌రు వ్య‌క్తి భార్య‌తో…ఆ స్టేష‌న్ S.I రెండు ల‌క్ష‌లిస్తే వ‌దిలేస్తామ‌ని లేదంటే విడిచిపెట్టేది లేద‌ని చెప్పాడు. దీంతో ఆ మ‌హిళ‌ అప్పు తెచ్చి ఒక ల‌క్ష రూపాయ‌ల‌ను అత‌నికిచ్చింది, మ‌రో ల‌క్ష రూపాయ‌లకు కొన్ని రోజులు గ‌డువు కోరింది. అలా కుద‌ర‌ద‌ని చెప్పిన S.I , రాత్రి మీ ఇంటికి వ‌స్తాను ..నీతో స‌ర‌దాగా కాసేపు గ‌డుపుతాను అని ఓ ల‌ఫూట్ ఆఫ‌ర్ ఇచ్చాడు.!

S.I కి త‌గిన శాస్తి చేయాల‌నుకున్న స‌ద‌రు మ‌హిళ‌…స‌రే రండి.. ముస్తాబై మీకోసం రెడీగా ఉంటాన‌ని చెప్పింది. ఇక అనుకున్న టైమ్ ప్ర‌కారం శోభ‌న‌పు పెళ్ళికొడుకుగా ఆ మ‌హిళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడు S.I,అలా ఆ S.I, లోప‌లికి వెళ్ళిన కాసేప‌టికే…మ‌రోసారి ఆ ఇంటి డోర్ మోగింది. ముందుగానే అనుకున్న ప్ర‌కారం రెడీ గా ఉన్న ACB అధికారులు రంగంలోకి దిగి ఆ కామ S.I ని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు.

 

ఓ స్త్రీ…ఇంత ధైర్యంగా ఓ పోలీస్ ఇన్స్పెక్ట‌ర్ ను రెడ్ హ్యండెడ్ గా ప‌ట్టించ‌డం ప‌ట్ల నెటీజ‌న్లు స‌ద‌రు మ‌హిళ‌ను కీర్తిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top