గుండె పగిలిపోతుంది అంటూ పోస్ట్ చేసిన శ్వేతా బసు ప్రసాద్…! ఎందుకు..? మళ్లీ ఏం జరిగింది..?

శ్వేతా బసు ప్రసాద్..కొత్త బంగారులోకం సినిమాతో టాలివుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది..ఆ సినిమాలో నటనతో అందరిని ఆకట్టుకుంది..బాలనటిగా బాలివుడ్లో కెరీయర్ ప్రారంభించింది శ్వేత.కెరీర్ ప్రారంభంలోనే సినిమా హీరోయిన్లు పడే కష్టాలన్ని పడింది.అవకాశాలు లేక వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. అప్పుడప్పుడే కెరీర్లో ఎత్తుపల్లాలు చూసి ఒకేసారి గట్టి దెబ్బే తిన్నది ఈ సంఘటనతో శ్వేత…అప్పుడు మహిళాసంఘాలు అందరూ శ్వేతకే మద్దతు తెలిపాయి..ఆ సంఘటన తర్వాత ఒకసారిగా గోడకు కొట్టిన బంతిలా లేచింది శ్వేత చంద్రనందిని సీరియల్ తో..తన నటన ద్వారా మరొకసారి ప్రేక్షకుల మన్ననలు పొందింది.. ఇటీవల శ్వేత మరొకసారి కన్నీరు పర్యంతమైంది..దానికి కారణమేంటంటే..

కష్ట కాలంలో తనలో నటిని గౌరవించి ఆదుకున్న  సీరియల్ ‘చంద్ర నందిని’. ఈ సీరియల్ షూటింగ్ గురువారంతో ముగియడంతో శ్వేత తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపు పోస్ట్‌ పెట్టింది.‘ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుంది. ‘చంద్ర నందిని’ కూడా అలాగే ముగిసింది. ఆ బాధను చెప్పడానికి నాకు పదాలు దొరకడం లేదు. ఈ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఏక్తా కపూర్‌కి ,నా తోటి నటీనటులకు, ప్రొడక్షన్‌ బృందానికి కూడా ధన్యవాదాలు. రేపటి నుంచి షూటింగ్ కోసం స్టూడియోకి వెళ్లక్కర్లేదని అనిపించినప్పుడల్లా గుండెపగిలిపోతోంది. నన్ను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ధారావాహికలో నేను పోషించిన మహారాణి నందిని పాత్రను నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని శ్వేత తెలిపింది. ఈ సందర్భంగా సీరియల్‌లోని తోటి పాత్రదారులు, ఏక్తా కపూర్‌తో తీసుకున్న ఫొటోను షేర్ శ్వేతా షేర్ చేసింది.ఒకసారిగా హిట్స్ కొట్టి ,అవకాశాలు లేక తప్పుదోవ పట్టి మళ్లీ సరిదిద్దుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకంది.ఇప్పుడు అదేవిధంగా మరిన్ని అవకాశాలు తెచ్చుకోవాలని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top