జయలలిత సర్కార్ నే షేక్ చేసిన 'కోవన్" పాట! అరెస్ట్ లతో నాపాటను ఆపలేరు.

కోవన్ ..తమిళనాడులోని ఓ జానపద కళాకారుడు. ఇప్పుడతనికి దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులున్నారు. కాలికి గజ్జెకట్టి , చేతిలో డప్పు పట్టి కోవన్ పాట పాడాడంటే తమిళ ప్రజలంతా అతని పాటకు పట్టం కట్టాల్సిందే ..అటువంటి పాటగాడి మీద రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూశారు తమిళనాడు సర్కార్…   ఇతని పాటల్లోని పదాల్లో చాలా వరకు తమిళనాడు సిఎం జయలలితతో పాటు కరుణానిధిని కూడా కించపరిచేలా ఉన్నాయంటూ ఇతనిపై రాజద్రోహం కేసును పెట్టారు.

అయినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు కోవన్…తన పోరాటం వ్యవవస్థపైనే కానీ వ్యక్తుల మీద కాదని స్పష్టం చేశాడు.. మధ్యపానం నిర్మూళనే నాలక్ష్యం దాని కోసం నా పాటను ఆపేది లేదని తేల్చిచెప్పాడు కోవన్… ప్రజల కోసం సామాజిక మార్పు కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి  ధైర్యంగా ముందడుగేస్తున్న అతనినిని చూసి తమిళనాడు ప్రభుత్వమే వెనుకడుగు వేసి అతనిపై రాజద్రోహం కేసును ఉపసంహరించుకుంది.

Watch Kovan SOng:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top