ఒకపక్క “అఖిల్”తో పెళ్లి వద్దనుకుని..”సమంత-చైతన్య” పెళ్లిపై “శ్రియ భూపాల్” ఏమని పోస్ట్ చేసిందో తెలుసా.?

శ్రియా భూపాల్..కొన్ని నెలల క్రితం వరకు తనెవరో ఎవరికి తెలీదు..సినిమా తారలకు, రాజకీయనాయకులకు వారి పిల్లలకు ఉన్న క్రేజ్ ఎంత పెద్ద వ్యాపారవేత్తలకైనా ఉండదు..కొన్ని వందల కోట్లకు వారసురాలైన శ్రియా మనకు పరిచయం అయింది మాత్రం అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలిగానే..అక్కినేని నాగార్జున చిన్న కొడుకు మన సిసింద్రీ అఖిల్ తో నిశ్చితార్ధం తర్వాత శ్రియాభూపాల్ పెళ్లి వార్తల్లో మారుమోగిపోయింది.ఆ తర్వాత వారిద్దరి పెళ్లికి ఎన్నో ఏర్పాట్లు జరిగాయి.రోమ్ లో వివాహం జరపాలని అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు..అయినా సినిమా తారల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం..పెళ్లి అయిన వెంటనే బ్రేకప్ చెప్పుకున్నవారుంటారు..కొన్నేండ్లు కలిసి బతికాక కూడా విడిపోయిన వారుంటారు.ఇది పెద్ద విషయం కాదు వారికి…

అఖిల్ తో ప్రేమ,పెళ్లి వరకూ వచ్చి బ్రేకప్ అయినప్పటినుండి శ్రీయా ప్రతి కదలికపై మీడియా ఫోకస్ పెడుతుంది.అప్పట్లో యువహీరోతో వీకెండ్ పార్టీ అంటూ కూడా వార్తలొచ్చాయి.శ్రీయా భూపాల్ తో ఉన్న ఒక ఫోటోను అల్లు శిరీష్ పోస్టు చేశారు.వారిరువురు ఫ్యామిలి ఫ్రెండ్స్ అని తర్వాత ఆ విషయాల్ని పక్కన పెట్టేశారు.అఖిల్ తో రిలేషన్ మళ్లీ బలపర్చేందుకు మెగా ఫ్యామిలి కోడలు ఉపాసన కూడా శ్రీయాను ఒప్పించే బాద్యత తీసుకున్నట్టు వార్తలొచ్చాయి అవన్ని బెడిసికొట్టాయి..తాజాగా చైతన్య,సమంతా లపెళ్లి ఫోటోను ఎఫ్బీ లో పోస్టు చేసి విష్ చేసింది శ్రీయ భూపాల్.పెళ్లికి అటెండ్ అయింది లేనిది ఇంకా సస్పెన్సే. వాస్తవానికి సమంతా,చై ల పెళ్లికి ముందే అఖిల్ ,శ్రీయాల పెళ్లి ఫిక్స్ చేశారు..ఒకవేళ వారి పెళ్లి అయి ఉంటే సామ్ చై ల పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ జంటే  ఉండేదేమో… ఇప్పుడు శ్రీయ జస్ట్ విష్ చేసిందా.లేకపోతే అక్కినేని ఫ్యామిలితో తను రిలేషన్ కోరుకుంటున్నా అని దీని ద్వారా సందేశం పంపిందో…ఎందుకంటే అఖిల్ తో బ్రేక్ అప్ అయ్యాక ఫస్ట్ టైం శ్రీయా  రెస్పాన్స్ ఇదే.. ఏమో పెద్ద వాళ్ల ఇళ్లల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.

 

Comments

comments

Share this post

scroll to top