పాత నోట్ల రద్దు వల్ల….. ఈ వ్యక్తికి కలలో కూడా ఊహించని అవకాశం దక్కింది.!

అతడు అంబానీ కొడుకు కాదు, అలాగని కోట్లకు అధిపతి కాడు, చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న సగటు మద్యతరగతి పౌరుడు, అలాంటి వ్యక్తికి … 200 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్ లో ఒక్కడినే  కూర్చొబెట్టి మరీ సినిమా చూపించారు థియేటర్ యాజమాన్యం.! ఆశ్యర్యంగా ఉంది కదా.!! ఇది నిజం అహ్మదాబాద్ లో ఈ ఘటన జరిగింది. 200 మంది కూర్చోగలిగే థియేటర్ లో ఒక్కడే కూర్చొని సినిమా చూశాడు, అది కూడా కేవలం ఒక టికెట్ కు మాత్రమే డబ్బులు చెల్లించి, అదెలాగంటే……………………

01-1

అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ గా జాబ్ చేస్తున్న హరిపంచల్ కు బోర్ కొట్టడంతో……దగ్గర్లోని మల్టిఫ్లెక్స్ థియేటర్ కు వెళ్లాడు, అప్పటికే ఆ థియేటర్ లో ఆడుతున్న నాలుగు సినిమాల్లో మూడు ఇంతకు ముందే అతను చూసి ఉండడంతో, మహాయోధ రామ అనే సినిమా టికెట్ ను  తన డెబిడ్ కార్ట్ ను ఉపయోగించి తీసుకుని లోపలికి వెళ్లి కూర్చున్నాడు. సినిమా స్టార్ట్ అయ్యింది, కానీ ఆ థియేటర్ లో అతను తప్ప మరెవ్వరూ లేరు, అలా రెండున్నర  గంటల పాటు 200 మంది కూర్చొని చూసే సినిమాను  ఒక్కడే చూశాడు. తీరా విషయం ఏంటి అని ఆరా తీస్తే….. పాత 500/- 1000/- నోట్ల రద్దు కావడంతో సినిమాకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందట, దానికి తోడు ఈ   సినిమా కు సంబంధించిన టికెట్ ను అతడు తప్ప మరెవ్వరూ తీసుకోలేదట, 5 టికెట్స్ కంటే తక్కువ టికెట్స్ అమ్ముడుపోతే ఆ టికెట్ క్యాన్సల్ చేసే అవకాశం ఆ మల్టిఫ్లెక్స్ యాజమాన్యానికి ఉన్నప్పటికీ…. ఒక్కడికోసం సినిమా వేశారట.!

Comments

comments

Share this post

scroll to top