ప్రేమనేది ఎవడికివాడికి ఓ సెపరేట్ క్వశ్చన్ పేపరంటూ ఫిలాసఫీ చెప్పిన శౌర్య ట్రైలర్!

రాక్ స్టార్ మంచుమనోజ్ తన రూట్ మార్చి క్లాస్ ఎంటర్ టైనర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కుటుంబకథా చిత్రాలను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేసే దశరథ్ డైరెక్షన్ లో ‘శౌర్య’ సినిమా చేస్తున్నాడు మనోజ్. మనోజ్ సరసన అందాలతార రెజీనా హీరోయిన్ గా జతకట్టింది. చిత్ర ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకు సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ కలిగేలా ఈ చిత్ర ప్రోమోస్ ఉన్నాయి. ‘జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలు ఉంటాయి.. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది,మూడు వాస్తవంగా జరిగిన కథ” ఇలా ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. హ్యాపీగా సాగిపోతున్న ఒక యువకుడి జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ.

కుటుంబంలో నచ్చదు, వారికి దూరంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి బయలుదేరుతారు.ఈ ప్రయాణంలో ఎటువంటి మలుపులు తిరుగాయనేది సింపుల్ గా ‘శౌర్య’ చిత్ర కథ. ‘ఎదుటోడ్ని బట్టి మన క్యారెక్టర్ ఉండాలి గానీ మనకు మనం ఓ క్యారెక్టర్ ఫిక్స్ ఐతే బ్రతకంలేం’,’కోపం, పగ , ద్వేషం ఇవేవీ శాశ్వతం కాదు.. అన్నీ కాలంతోపాటే పోతాయి. ప్రేమే శాశ్వతం’ అనే డైలాగ్స్ బాగున్నాయి. వేద సంగీతం అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. సూర్యప్రకాష్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.థ్రిల్లింగ్ సినిమానే కాకుండా సినిమాలో కామెడీ కూడా బాగానే ఉండేలా ఉంది. చాలామంది కమెడియన్స్ నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ‘ప్రేమనేది ఎవడికి వాడికి  సపరేట్ క్వశ్చన్ పేపర్, నా ఆన్సర్ నీకు పనికిరాదు , నీ ఆన్సర్ నాకు పనికిరాదంటూ’ ఒక కన్ఫ్యూజన్ ను చిత్ర ట్రైలర్ లో క్రియేట్ చేశాడు.

Watch Shourya Trailer:

Comments

comments

Share this post

scroll to top