పాట సూపర్…సినిమా కోసం వెయిటింగ్.! చాలా రోజులైందబ్బీ గిట్టాంటి పాటినక…!

సప్ప, సప్ప తిండి తినేటోడికి…ఒక్కసారి అమ్మమ్మ ఇంటి దగ్గర  పెట్టిన అవకాయ్ రుచి చూపిస్తే  ఎలా ఉంటుంది.? KFC లు, డామినోస్ బలాదూర్ అనిపించదూ…!?  సేమ్ టు సేమ్   అర్థం, పర్థంలేని సంగీతాన్ని, సాహిత్యాన్ని సినిమా పాటల రూపంలో మనమీద కుమ్మరిస్తున్నటువంటి ఈ సమయంలో…..  ఓ నండూరి ఎంకిపాట లాగా, అర్థవంతమైన గ్రామీణ  పదాల సౌందర్యాన్ని, వినసొంపైన సంగీతం తో కలిపి వినిపించారు శౌర్య సినిమా యూనిట్.  మంచు మనోజ్ హీరోగా, రెజీనా హీరోయిన్ గా, ప్రముఖ దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో రాబోతున్నశౌర్య  చిత్రంలోనిదే ఈ పాట. ఈ పాట వింటుంటే ఏదో తెలియని తన్మయత్వానికి గురవుతున్నట్టుంది,  ప్రశాంతంగా పాట వినే ప్రయత్నం చేయండి తప్పకుండా ఆ అనుభూతిని పొందుతారు.

Watch Song: 

Comments

comments

Share this post

scroll to top