షార్ట్ ఫిలిం కి అలాంటి కాప్షన్ పెట్టినందుకు నెటిజెన్లు సీరియస్ వార్నింగ్..! కానీ డైరెక్టర్ ఏమన్నాడంటే!

ప్రస్తుతం వెండితెర సినిమాలకే కాదు బుల్లితెర సినిమాలకు క్రేజ్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, సాంగ్స్, డాన్స్ …ఇలా అన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా హై రేంజ్ లోనే ఉన్నాయి. యూట్యూబ్ లో రిలీజ్ అయిన షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఎంతో మంది నటీనటులు, దర్శకులు సినిమా అవకాశాలు పెట్టేస్తున్నారు. ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో కూడా డబ్స్ మాష్ చేసి అమ్మాయిలు చాలా ఫేమస్ అయిపోతున్నారు. అందులో ఫస్ట్ “దీప్తి సునైనా”. వైవా ఫేమ్ “షన్ను” తో కలిసి కొన్ని సాంగ్స్ కి డాన్స్ కూడా చేసింది.

అయితే ఇప్పుడు కొత్తగా “కౌశిక్” దర్శకత్వంలో “సీత” అనే షార్ట్ ఫిలిం కూడా చేస్తుంది. ఈ షార్ట్ ఫిలిం పోస్టర్ ఇటీవలే విడుదల అయ్యింది. షార్ట్ ఫిలిం కాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ అయ్యింది. “I am not a virgin” ఇది ఈ సినిమా కాప్షన్. “సీత” అంటే మనం దైవంగా భావించే పేరు. ఆ పేరుకి అలంటి కాప్షన్ ఏంటి అని ఎంతో మంది వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అయితే డైరెక్టర్ మాత్రం “సినిమా చూసిన తరవాత మాట్లాడండి” అంటున్నారు. ప్రస్తుత సమాజంలో అమ్మాయిల పై జరిగే అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని సమాజశ్రేయస్సు కోసం తీసిన సినిమా అది. కాప్షన్ చూసి అభ్యంతరం వ్యక్తం చేయడం బాగోలేదు అన్నాడు.
ఆడియన్స్ ఎందుకు వద్దంటున్నారో? వారికి డైరెక్టర్ కౌశిక్ ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూడండి!

Watch Video Here:

ఈ షార్ట్ ఫిలిం టైటిల్ పై మీ స్పందన ఏంటి? ఇలాంటి కాప్షన్ ఉండటం కరెక్ట్ అంటారా? కామెంట్ చేయండి!

Comments

comments

Share this post

scroll to top