(Aids+B)^2 …సందేశాత్మక షార్ట్ ఫిల్మ్.

హెచ్ఐవి, ఎయిడ్స్.. ఈ రెండిటికి పెద్ద తేడా లేదని అందరూ అనుకుంటారు. ఎయిడ్స్  గురించి తెలిసిన వారు అవునని తమకు తోచిన విధంగా చెబుతూ ఉంటారు. హెచ్ఐవి అనేది ఎయిడ్స్ వ్యాప్తి చెందడానికి కారణమయ్యే ఒక వైరస్ మాత్రమే. హెచ్ఐవి వైరస్ సోకిన వారు కచ్చితంగా ఎయిడ్స్ వ్యాధికి గురవుతారు అన్న ఆలోచన చేయడం పెద్ద తప్పు. ఎందుకంటే ఆ వైరస్ బారిన ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ కు బలికావాల్సిందే అనుకోవడం పొరపాటు. హెచ్ఐవి మన శరీరంలోకి సోకిందా లేదా అని తెలుసుకోవడానికే 3 నుండి 6 నెలలు పడుతుంది. హెచ్ఐవి నుండి ఎయిడ్స్ దశకు చేరుకోవడానికి సుమారుగా 10 సంవత్సరాలైనా పడుతుంది. అయితే హెచ్ఐవి వైరస్ మన శరీరంలోకి సోకిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాల ద్వారా కనిపెట్టవచ్చు కానీ హెచ్ఐవి రక్త పరీక్ష ద్వారానే ఈ విషయం బయటపడుతుంది.

ఒక అమాయక తండ్రి ఒకరోజు తన కొడుకు ముందు తన కార్యాలయంలో  ఉద్యోగి బయట ఆహారం తినడం వలన తనకు ఎయిడ్స్ వచ్చిందని తన భార్యతో చెబుతాడు. ఇంకా చిన్నవయసులోనే ఉన్న ఆ కుర్రాడు అసలు ఎయిడ్స్ అంటే ఏంటి? అనే కుతూహలం ప్రతి సెకన్ తన మెదడులో తిరుగుతూ ఉంటుంది. అందుకే ఎయిడ్స్ గురించి నెట్ లో వెదకడం మొదలుపెట్టి, ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది. ఎయిడ్స్ సోకడానికి గల కారణాలు, ఎయిడ్స్ ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకున్నాడు. ఈ ప్రాసెస్ లోనే హెచ్ఐవికి,ఎయిడ్స్ కు మధ్య ఉండే వ్యత్యాసం తెలుసుకున్నాడు. ఇక అన్నీ తెలుసు అనుకున్న తన తండ్రి ఇంకో కొత్త రోగం గురించి చెప్పాడు. ఎన్నో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, అది వస్తే ఇక అంతే. వాటి గురించి ఎవరికీ ఏమీ తెలీదు అని అంటుండగా, అసలు విషయం మొదలుపెట్టి, తన తండ్రిలాంటి వారికి, ఎయిడ్స్, హెచ్ఐవి ల మధ్య నలిగిపోతున్న వారికి ఆ కుర్రాడు ఒక మంచి సందేశాన్ని ఈ లఘుచిత్రం ద్వారా తెలిపాడు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top