ఆ భయంతోనే ప్రేమలో పడుతున్నారు అంట..! కానీ చివరికి ఏమవుతుందో తెలుసా..?

ఒక జంట మ‌ధ్య ప్రేమ అనేది ఎప్పుడు క‌లుగుతుందో, అది ఏ సందర్భంలో, ఎందువ‌ల్ల పుడుతుందో క‌చ్చితంగా చెప్ప‌లేం. కానీ యువ‌తీ యువ‌కుల మ‌ధ్య ప్రేమ అనేది చిగురించాక అందులో నిజాయితీ ఉంటే దాన్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఆ ప్రేమ జంట‌ను విడ‌దీయ‌లేరు. సాధార‌ణంగా యువ‌తీ యువ‌కులు ప్రేమ‌లో ప‌డేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కొంద‌రు మాత్రం ఒంట‌రిగా ఉండాల్సి వ‌స్తుంద‌నే భావ‌న‌తో, అదో ర‌క‌మైన భ‌యం లాంటి ఫీలింగ్ క‌లిగి ప్రేమ‌లో ప‌డ‌తారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మానసిక శాస్త్ర‌వేత్త‌లు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. చాలా మంది యువ‌తీ యువ‌కులు ఒంట‌రిగా ఉండాల్సి వ‌స్తుంద‌ని, త‌మ‌కూ ఓ తోడుంటే మంచిద‌నే భావ‌న‌లో ఉండి ప్రేమ‌లో ప‌డ‌తార‌ట‌.

ఒంట‌రిగా ఉండాల్సి వ‌స్తుంద‌నే భావ‌న‌తో ప్రేమ‌లో ప‌డేవారికి సాధార‌ణంగా ఇత‌ర ప్రేమికుల‌ను చూసి, వారి అన్యోన్య‌త‌ను చూసి తాము కూడా ప్రేమ‌లో ప‌డితే బాగుంటుంద‌ని, దాంతో ఇద్ద‌రూ గిఫ్ట్‌లు ఇచ్చుకోవ‌చ్చ‌ని, వారాంతాల్లో స‌ర‌దాగా అంద‌రిలా ల‌వ‌ర్‌తో గ‌డ‌ప‌వ‌చ్చ‌ని అనిపిస్తుంద‌ట‌. అందుకే అలా ఒంట‌రిగా ఉండే వారు ఎవరో ఒక‌రులే అని చెప్పి ఎవ‌రో ఒక‌రితో ప్రేమ‌లో ప‌డ‌తారు. మొద‌ట అది ఆక‌ర్ష‌ణ‌గానే ఉంటుంది. కానీ త‌రువాత కొంత కాలం అయ్యే సరికి వారి మ‌ధ్య ఎలాగూ ప్రేమ న‌శిస్తుంది క‌నుక వారు విడిపోతారట‌. స‌హ‌జంగా ఎలాంటి భావ‌న‌లు లేకుండా ఒంట‌రిగా ఉండాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతోనే ఎవ‌రో ఒక‌రితో ప్రేమ‌లో ప‌డేవారు కొంత కాలం అయ్యాక విడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

ఒంట‌రిత‌నం వెంటాడుతుంద‌ని, మ‌న జీవితంలో మ‌నం ఎన్నో మిస్ అవుతున్నామ‌ని, ఏదో ఒక తోడు ఉండాల‌ని, క‌చ్చితంగా మ‌న‌కు సోల్‌మేట్ అవ‌స‌రం అని భావించే వారు ముందు వెనుక‌లు ఆలోచించ‌కుండా త‌మ‌కు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే వారితో బంధం ఏర్ప‌రుచుకుని ప్రేమ‌లో ప‌డ‌తార‌ట‌. దీంతోపాటు తాము ఎంచుకున్న వ్య‌క్తే త‌మ‌కు స‌రైన వారు అనే భ్ర‌మ‌లోనే ఉంటార‌ట‌. వారు ఈ నిర్ణ‌యాన్ని చాలా తొంద‌ర‌పాటుగా తీసుకుంటార‌ట‌.

సాధార‌ణంగా మ‌నుషులు ఎవ‌రికైనా త‌మ‌కు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించిన వ్య‌క్తులు ఎవ‌రైనా క‌నిపిస్తే వారిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు విడుద‌ల‌వుతాయ‌ట‌. దీంతో స‌హ‌జంగానే అవ‌త‌లి వారు అంటే ఆక‌ర్ష‌ణ ఏర్ప‌డుతుంది. ఇది థ్రిల్‌ను క‌లిగిస్తుంది. కానీ ఇది కొంత సేపు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. అలా కొంత సేపు మాత్ర‌మే ఉండే ఫీలింగ్ కేవ‌లం ఆక‌ర్ష‌ణ మాత్ర‌మేన‌ని, ప్రేమ కాద‌ని అంటున్నారు. ఇక దీన్ని ప్రేమ అనుకునే వారు తాము ప్రేమించే వ్యక్తి ఎక్క‌డ దూర‌మ‌వుతారోన‌ని, అలాంటి వారు మ‌రొక‌రు దొర‌క‌ర‌నే భ్ర‌మ‌లో ఉండి వారితో బంధాన్ని కొన‌సాగించాల‌ని చూస్తార‌ట‌. వారితో బంధాన్ని వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ర‌ట‌. దీంతో వారిలో ఒంట‌రిగా ఉండాలా, జంటగా ముందుకు సాగాలా అని సందేహాలు వ‌స్తాయ‌ట‌. ఇక ఏ వ్య‌క్తి అయినా మ‌రొక వ్య‌క్తిని పొగుడుతుంటే అలాంటి సంద‌ర్భాల్లో కొంద‌రు ప్రేమ‌లో ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ట‌. కానీ ఇది ఆ సంద‌ర్భం వ‌ల్ల క‌లిగిన ఆక‌ర్ష‌ణ మాత్ర‌మేన‌ట‌. అది ఆక‌ర్ష‌ణ అని తెలియ‌క కొంద‌రు ప్రేమ‌లో ప‌డ‌తార‌ట‌. అలాగే ఏదైనా క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ఓదార్పు మాట‌లు చెప్పే వారి వ‌ల్ల కూడా కొంద‌రు ప్రేమ‌లో ప‌డ‌తార‌ట‌. కానీ అలాంటి స‌మ‌యాల్లో అలాంటి మాట‌లు చెప్పే వ్య‌క్తులు జీవితాంతం వెంట ఉంటారా అన్న‌ది తెలుసుకుని మ‌రీ వారితో ప్రేమ‌లో కొన‌సాగాలా, వ‌ద్దా అనే విష‌యం తేల్చుకోవాల‌ట‌.

Comments

comments

Share this post

scroll to top