చెప్పిందల్లా నమ్మడానికి అందరూ వెర్రి వెంగళప్పలు కాదు. అక్కడక్కడ ఇట్లాంటోళ్ళుంటారు.మనోడి దెబ్బకు ఏకంగా ఎయిర్ టెల్ సంస్థకే దిమ్మతిరిగినంత పనైంది. కొన్ని రోజుల క్రితం ఈ సబ్బు వాడితే దేవకన్యలు మీ ఒడిలో వాలిపోతారని మళయాళ హీరో మమ్ముట్టి యాడ్ ఇచ్చారు, అయితే ఓ వినియోగదారుడు నేను సబ్బు వాడాను మరి నాకోసం ఎవ్వరూ రాలేదేంటని.. ? హీరో మోసపూరిత ప్రకటన ఇచ్చాడని కోర్టు లో కేసు వేశాడు. దాంతో కోర్టు హీరో కు నోటీసులు పంపింది.
తాజాగా మరో వినియోగదారుడు ఎయిర్ టెల్ 4-G యాడ్ మీద కోర్టు కెక్కాడు. ఎయిర్టెల్ 4జీ ఎప్పుడైనా, ఎక్కడైనా వేగవంతమైన నెట్ వర్క్. ఒకవేళ మీ నెట్ వర్క్ ఇంతకన్నా వేగంగా ఉంటే, మేము జీవితాంతం మీ మొబైల్ బిల్లులు చెల్లిస్తాం అంటూ ఆ యాడ్ లో ఉంటుంది. ఈ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సదరు వినియోగదారుడు తన పిర్యాదు చేశాడు.
ఇదే విషయమై ప్రకటనల ప్రమాణాల విభాగం (ఏఎస్సీఐ) నుంచి ఎయిర్ టెల్ కు నోటీసులు వెళ్లాయి. దీనిని బట్టి ఎయిర్ టెల్ 4-G ప్రస్తుత యాడ్ ను ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. సబ్బు వాడితే స్వప్న సుందరిలు గా మారడం, యంత్రాలు కట్టుకుంటే కుబేరులం అవుతాం లాంటి ప్రకటనలను కూడా ఓ చూపు చూడాల్సిన అవసరం ఉంది.