పాక్ లో మోడీ తాగిన టీ మీద పెరిగిన వేడి! దాని వల్లే 7 గురు సైనికులు మరణించారని మండిపడ్డ శివసేన

మూడు రోజుల క్రితం ప్రపంచమంతటా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటే, మనకు రక్షణగా నిలుస్తున్న మనదేశ జవాన్లు పాకిస్తాన్ ఉగ్రవాదుల ఘాతుకానికి ఏడుగురు సైనికులు దుర్మరణం చెందారు. పంజాబ్ బార్డర్ పటాన్ కోట్ లో జరిగిన ఈ సంఘటన దేశ ప్రజలందరినీ కంటతడి పెట్టేలా చేసింది. అయితే ఈ ఉగ్రవాద చర్యలకు కారకుడు ప్రధాని నరేంద్రమోడీనేనని శివసేన పార్టీ విరుచుకుపడింది.పాకిస్థాన్ పర్యటన వెళ్లి, ఆ దేశ ప్రధానితో రెండు దేశాల సత్సంబంధ విషయాల గురించి మాట్లాడటం వల్ల ఈ చర్యలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. పాక్ ను నమ్మవద్దని పలుసార్లు తమ పార్టీ హెచ్చరిస్తున్నా మోడీ మా మాటలు పెడచెవిన పెట్టారని,ప్రపంచ దేశాలను కలుపుకు వెళ్ళడం మాని, ముందు మన దేశం భద్రతా చర్యల విషయంలో ఎదురుదాడి జరుగుతున్నప్పుడు ఎలా ఎదుర్కోవాలో వాటిపై దృష్టిపెట్టాలని, ప్రాణాలను విడిచిన అమరవీరులను తలుచుకుంటూ సోషల్ మీడియాలలో పంచుకోవడం మినహాయిస్తే ఈ ప్రభుత్వం అసమర్థన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని శివసేన తమ అధికార పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది.

1381736135Uddhav-Thackeray-rally-5-3

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కలిసి ఒక కప్పు టీ తాగి దేశ సత్సంబంధాల గురించి మాట్లాడుకున్నందుకు ఏడుగురు జవాన్లను బలి తీసుకుని  మర్చిపోలేని ప్రతిఫలాన్ని ఇచ్చారని, ఇప్పటికైనా పాక్ ను నమ్మాలో వద్దో ఆలోచన చేయాలని పేర్కొన్నారు. అలాగే మన దేశ భద్రత చర్యలు సురక్షితంగా లేవని,తీసుకోవాల్సిన అంతర్గత భద్రత విషయాలు ఎన్నో ఉన్నాయని ముందు వాటిపైఇ దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఒకవేళ మనదేశంతో పాక్ సత్సంబంధాలు కోరుకుంటుంటే వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ను అప్పగించాలని శివసేన డిమాండ్ చేసింది.

Comments

comments

Share this post

scroll to top