మా అధ్యక్షకుడిగా “శివాజి రాజా” రాజీనామా..? అందరి లెక్కలు తేలాల్సిందే అంటున్న పవన్?

శ్రీరెడ్డి ఇష్యూ, కాస్టింగ్ కౌచ్, తన తల్లిని తిట్టించడానికి జరిగిన కుట్ర తదితర పరిణామాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం దాల్చారు. టీఆర్పీల కోసం మీడియా ప్రవర్తిస్తున్న తీరుతో విసిగిపోయిన ఆయన వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను అంటూ ఆగ్రహంగా ఫిలిం ఛాంబర్ వైపు కదిలారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను. ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిది అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘మా’ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఇష్యూను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందే పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు అనే వాదన వినిపిస్తోంది. దీనికి బాధ్యత వహిస్తూ ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలను, వివాదాలను ఒక కొలిక్కి తేవాలని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఫిలిం చాంబర్లో తిష్టవేసిన ఆయన ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు..

ఇండస్ట్రీలో తప్పుడు పనులు చేస్తున్న అందరి లెక్కలు తేల్చడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సీనీ ప్రముఖులంతా సమావేశానికి రావాలంటూ కోరినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం, క్యాష్ కమిటీకి సంబంధించిన అంశంపై పవన్ కళ్యాణ్ న్యాయ వాదులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పలువురు న్యాయవాదులు కూడా ఫిలిం చాంబర్‌కు చేరుకున్నారు.

ఇండస్ట్రీపై ఇంత జరుగుతున్న మౌనం ఎందుకని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ పరువు తీసే విధంగా మీడియాలో ఇంత రాద్దాంతం జరుగుతున్న పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? తప్పు చేసిన వారి పట్ల ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు అని ఈ సమావేశంలో నిలదీయనున్నట్లు సమాచారం.

 

Comments

comments

Share this post

scroll to top