అమీర్ ఖాన్ చెంప చెళ్ళుమనిపించండి లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి :శివసేన చైర్మన్.

అమీర్ చెంప చెళ్ళుమనిపించండి లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి. ఇదేదో కొత్త కాంటెస్ట్ కాదు. గత కొద్ది రోజులుగా అసహనంపై అమీర్ చేసిన వ్యాఖ్యలను  వ్యతిరేకిస్తూ పంజాబ్ కు చెందిన శివసేన చైర్మన్ రాజీవ్ టాండన్ “ఎవరైతే అమీర్ ను చెంప దెబ్బ కొడతారో, ఒక్కో చెంప దెబ్బకు రూ. 1 లక్ష ఇస్తామని ప్రకటించాడు”. ప్రస్తుతం ‘దంగల్’ సినిమా షూటింగ్ కొరకు లుథియానాలోని ఓ హోటల్ లో  ఉన్నారు, అయితే అమీర్ ఖాన్ ను  ఆ సినిమా సినిమా యూనిట్, హోటల్ మేనేజ్ మెంట్, అందులో పని చేసే ఎవరైనా సరే  చెంపదెబ్బ కొట్టి లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోమని టాండన్ ప్రకటించారు.

maxresdefault

మరోవైపు అమీర్ బసచేస్తున్న  హోటల్ ముందు అమీర్ దిష్టి బొమ్మలను తగలబెడుతూ, నినాదాలు చేశారు శివసేన కార్యకర్తలు. దీంతో పరిస్థితి చేజారిపోతుందని గమనించిన హోటల్ అధికారులు వెంటనే పోలీసులను సంప్రదించారు. అయినప్పటికీ కార్యకర్తలు  అమీర్ ఖాన్ బసచేస్తున్న గదిలోకి  ప్రవేశిస్తుండగా పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అమీర్ గదిలో లేడని  హోటల్ అధికారులు ఎంత చెప్పినా వినకుండా అక్కడ వీరంగం సృష్టించారు.

 

Comments

comments

Share this post

scroll to top