శ్రీరెడ్డిపై కేసు వేసిన హీరో శివబాలాజీ.! కంప్లైంట్ లో ఏం రాశాడో తెలుసా.? మీరే చూడండి!

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు సర్వత్రా వ్యతిరేఖత వస్తుంది.తాజాగా నటుడు శివబాలాజి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ,శ్రీరెడ్డి పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని  రాయదుర్గం పోలిస్ట్ స్టేషన్లో చేసిన తన ఫిర్యాదులో సూచించారు..

నేను శివబాలాజీని. వృత్తిపరంగా నటుడిని. అంతేకాకుండా పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయనతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏప్రిల్ 16వ తేదీన 5 గంటల ప్రాంతంలో నా ఇంట్లో టెలివిజన్ చూస్తుండగా, ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై దారుణంగా కామెంట్స్ చేసింది. నాలాంటి అభిమానిని తట్టుకోలేని విధంగా ప్రవర్తించింది.పవన్ కల్యాణ్‌ను, ఆయన తల్లిని అత్యంత దారుణమైన, నీచమైన పదజాలంతో తిట్టింది. కొందరు రాజకీయ నేతల ప్రోద్బలంతోనే శ్రీరెడ్డి తిట్టిందని తెలుసుకొన్న నేను చాలా షాక్‌కు గురయ్యాను. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కల్యాణ్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే ఈ కుట్ర చేశారు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పవన్ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయనే భావన నాకు కలిగింది. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంలో శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోకుంటే ప్రజా సంక్షేమానికి దెబ్బగా మారే పరిస్థితి ఉంది.శ్రీరెడ్డి వ్యాఖ్యల అనంతరం పవన్ కల్యాణ్ అభిమానిగా నేను ఆమెపై కేసు నమోదు చేయాలని భావించాను. ఆమె వాడిన నీచమైన పదజాలం మహిళల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు ప్రజల శాంతికి చేటు కలిగే విధంగా ఉన్నాయి. కావున శ్రీరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ శాఖను కోరుకొంటున్నాను అని శివ బాలాజీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాస్టింగ్ కౌచ్ పై గత కొంతకాలంగా శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలో  సమస్యుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి ప్రెస్ దగ్గరకు కాదు అని పవన్ వ్యాఖ్య చేశారు.దానిని వ్యతిరేఖించిన శ్రీరెడ్డి మా….ద్ అంటూ అసభ్య పదజాలంతో పవన్ ని సంభోదించింది.ఈ వ్యాఖ్యలకు పవన్ ఫ్యాన్స్ నుండే కాకుండా ఇండస్ట్రీ నుండి,తన పోరాటంలో సభ్యుల నుండి కూడా వ్యతిరేఖత వచ్చింది.ఈ వ్యవహారంపైనే శివబాలాజి కంప్లైంట్ ఇచ్చారు..కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాన్ కు తమ్ముడిగా నటించారు శివబాలాజి..

Comments

comments

Share this post

scroll to top