ఆ ఊరిపేరు Snap Deal.Com నగర్… కృతజ్ఙతను చాటిన గ్రామస్థులు.!

శివ్ నగర్….ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ జిల్లాలోని ఓ గ్రామం. మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని మైళ్ళకు మైళ్ళ దూరం వెళ్తూ, మోసుకొస్తున్న ఆ మహిళలను,చిన్నపిల్లలను చూసి మనసు చలించింన ఓ కంపెనీ CEO తక్షణమే వీరి సమస్య తీర్చాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువు 15 నీటిపంపులు ఆ గ్రామంలో వేయించాడు. ఆ CEO పేరు కునాల్ బాహాల్ …ఆ కంపెనీ స్నాప్ డీల్…. కట్ చేస్తే అతడి కంపెనీ పేరే ఇప్పుడు తమ  ఊరికి పెట్టుకున్నారు ఆ గ్రామస్థులు. తమను ఆదుకున్న వారిని ఎన్నటికీ మర్చిపోమని మన భారతీయతత్వాన్ని చాటారు శివ్ నగర్ గ్రామస్థులు.

916483254

2011లో ఉత్తరప్రదేశ్ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళాడు స్నాప్ డీల్ ఈ కామర్స్ సీయీవో కునాల్ బాహల్. అక్కడ తాగునీటిని తెచ్చుకోడానికి మహిళలు పడుతన్న కష్టాన్ని చూసి  చలించిపోయిన బహాల్…. వెంటనే 3,33,000వేలు విరాళంగా ఇచ్చి 15 నీటి పంపులను వేయించాడు. మంచి పని మనవల్ల జరిగితే మనిషి తన రుణం ఎలా తీర్చుకుంటాడు అనే దానికి ఉదాహరణగా ఆ గ్రామస్థులు శివ్ నగర్ ను కాస్తా ‘స్నాప్ డీల్. కామ్’నగర్ గా మార్చేశారు. తమ సమస్యను తెలుసుకొని ఇదంతా చేసిన కునాల్ బాహల్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆ గ్రామస్థులు. ప్రస్తుతం అందరికీ వైద్యం, పిల్లలకు చదువు, ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించేందుకు స్నాప్ డీల్ సీయీవో కృషి చేస్తున్నాడు.

991137757

465724542

Comments

comments

Share this post

scroll to top