బాలీవుడ్ బ్యూటీ తిన్న ఐస్ క్రీం వైరల్… ఆ ఐస్‌క్రీమ్ ధర ఎంతో తెలుసా …? ( Watch Video )

సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎం పని చేసినా ఇట్టే తెలిసిపోతుంది.దాచాలనుకున్న దాగదు. అయితే బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి తిన్న ఓ ఐస్ క్రీం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అది మాములు ఐస్ క్రీం కాదంట.. బంగారు ఐస్ క్రీం అట. వామ్మో ఏకంగా బంగారు ఐస్ క్రీం తిన్నదా అనుకుంటున్నారా?.. అవును మరీ ఇది వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

ఇటివలే శిల్పా విహారయాత్ర కోసం హాంకాంగ్‌కు వెళ్లింది. అయితే అక్కడ ఓ రెస్టారెంట్‌లో బస చేసిన శిల్పా.. ఆ రెస్టారెంట్లో ఉన్న స్పెషల్ ఐస్ క్రీం ని టెస్ట్ చేసింది. ఆ ఐస్ క్రీం పేరు గోల్డెన్‌ లీఫ్‌. వెనీలా ఫ్లేవర్‌లో ఈ ఐస్‌క్రీమ్‌ ని లాగించింది శిల్పా. ఆ ఐస్ క్రీం తనకి బాగా నచ్చిందట. యోగా సుందరి తిన్న ఐస్ క్రీం చాలా బాగుందని..తనకి బాగా నచ్చిందని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దింతో ఆ ఐస్ క్రీం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

ఇంతకి ఈ ఐస్ క్రీం ప్రత్యేకత ఎంటంటే గోల్డెన్ ఐస్‌క్రీమ్‌ అని పిలవబడే దీనిని చాలా ఖరీదైన పాలతో తయారు చేస్తారు. ఈ ఐస్‌క్రీమ్‌పై 24క్యారెట్ల బంగారపు పూత వేస్తారు. అందుకే దీనిని గోల్డేన్ ఐస్ క్రీం గా పిలుస్తారు. ఇక్కడకి అనేక దేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. కాబట్టి ఎవరి టెస్ట్ కి తగ్గట్టుగా వారి కోసం వివిధ రూపాల్లో తయారుచేస్తారు. ఈ ఐస్‌క్రీమ్ ధర 13 డాలర్లు.

శిల్పా శెట్టి నోరు తగలడంతో ఈ ఐస్ క్రీం కాస్త ప్రపంచమంతటా పాపులర్ అయ్యింది.

Insta:

 

Comments

comments

Share this post

scroll to top