లీడర్-2 గా రానున్నభల్లాలదేవ.

అయిదు సంవత్సరాల క్రితం…  6.3 అడుగుల ఎత్తులో.. నూనుగు మీసాలతో అసెంబ్లీలో అధ్యక్షా అంటూ రాజకీయాలపై సరికొత్త ముద్ర వేస్తూ వచ్చిన  దగ్గుబాటి రానా లీడర్ సినిమా గుర్తుందా..? శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రానా మొదటి సారిగా తెలుగు  చిత్ర పరిశ్రమకు  లీడర్ సినిమాతోనే పరిచయం అయ్యారు. అది అప్పట్లో ఓ సంచలనం, సందేశాత్మకం.
తర్వాతతర్వాత హైట్ ను, నటనను బేస్ చేసుకొని బాలీవుడ్ లో కూడా మెరిశాడు రానా.  క్రిష్ దర్శకత్వంలో  కృష్ణం వందే జగద్గురుం సినిమాతో  మరింత  షైన్ అయిన రానా..  జక్కన్న చెక్కిన అద్భుత కళాఖండం బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రతో ఎక్కడికో ఎదిగిపోయాడు. క్రిటిక్స్ పరంగా చెప్పాలంటే  హీరో ప్రభాస్ కంటే కూడా బాహుబలి సినిమాతో  ఎక్కువ పేరు సంపాదించుకుంది రానానే.
అంత క్రేజ్ వచ్చిన రానాతో మరోసారి సినిమా తీసే యోచనలో ఉన్నాడట శేఖర్ కమ్ముల.. 2010 లో విడుదలై రాజకీయాలను ఆలోచింపజేసిన లీడర్ కు సీక్వెల్ తీస్తారట.   అయితే సీక్వెల్ ను మాత్రం సరికొత్త ఫార్మాట్ లో తీస్తారని ప్రచారం జరుగుతోంది. దీని గురించి రానా కూడా ఓ ప్రెస్ మీట్ లో చెప్పేశాడు.  బాహుబలి భల్లాల దేవుడిని ఇప్పుడు కొత్త ఫార్మాట్లో చూడబోతున్నామన్న మాట..

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top