“దొంగ చాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్లేవాళ్లం…ఎందుకంటే??”- ఫేస్బుక్ లైవ్ లో ఫైర్ అయిన “శేఖర్ మాస్టర్”!

రాకేష్ మాష్టర్,శేఖర్ మాష్టార్ ..తెలుగు సిని ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేర్లు..ఢీ షో తో ఇద్దరూ అందరికి మరింత దగ్గరయ్యారు…టాలివుడ్లో ఎందరికో టాలీవుడ్లో సీనియర్ డాన్స్ మాస్టర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం చేసిన వారిలో శేఖర్ మాష్టర్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డాన్స్ మాస్టర్లలో ఒకరిగా ఉండడమేకాదు..ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు శేఖర్. ఆ మధ్య శేఖర్ మాష్టార్ మీద రాకేష్ మాష్టార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..ఇప్పుడు ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు శేఖర్ మాష్టారూ…

నా తల్లిని తిట్టాడు..అందుకే మాట్లాడడం మానేసాను..

ఉగాది సందర్భంగా ఫేస్‌బుక్ లైవ్ చాట్లో రాకేష్ మాస్టర్‌తో మీ గొడవ ఏమిటి? అనే ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు.రాకేష్ మాస్టర్ తో నాకు గొడవ ఏమీ లేదు. మా మధ్య ఏం జరిగింది అనేది నాకు, సత్యకు, మాస్టర్ గారికి మాత్రమే తెలుసు. గడ్డం వేణు మాస్టర్ అని ఇంకో మాస్టర్…గొడవ సమయంలో అక్కడ ఉన్న కొందరు స్టూడెంట్స్‌కు మాత్రమే తెలుసు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తల్లికంటే ఎవరూ గొప్ప కాదు. నా తల్లిని రాకేష్ మాస్టర్ తిట్టడం వల్లే గురువు గారితో మాట్లాడటం మానేసి దూరంగా ఉంటున్నాను….. అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

నా భార్య పునుగులు ,బజ్జీలు అమ్ముకోవడం ఏంటి??

నా భార్య పునుగులు, బజ్జీలు, ఇడ్లీలు అమ్ముకుందని రాకేష్ మాస్టర్ చెబుతున్నారు. మాస్టర్ గారు ఎప్పుడూ చూశారో నాకు అర్థం కావడం లేదు. మాస్టర్ గారు ఇంటర్వ్యూలో ఆ మాట అనగానే రెండు మూడు రోజులు మా ఆవిడ భోజనం కూడా చేయలేదు. ఎందుకు అలా అన్నారో వెళ్లి అడుగుతాను అంటే నేనే ఆపాను. మా పక్కింటోళ్లు కేసు పెడదాం అంటే వద్దు అని ఆపాను… అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

దొంగ చాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్లేవాళ్లం…ఎందుకంటే??

తిండి పెట్టి పోషించాను అన్నారు. తిండి పెట్టడానికి ఏంటండీ… మాకు ఎవరికీ తినడానికి లేదు… ఆయనకు లేదు మాకు లేదు. ఆయనే తిండి పెడితే మేము దొంగచాటుగా ఫంక్షన్ హాల్స్ కు ఎందుకు వెళతాం? నేను ఇదంతా చాలా బాధతో చెబుతున్నా. కొంచెం బియ్యం ఉంటే మాస్టర్ గారికి వండి పెట్టి మేము ఫంక్షన్ హాలుకు వెళ్లి దొంగచాటుగా తినేసి ఆయకు స్వీట్స్ ఏమైనా ఉంటే తెచ్చి ఇచ్చేవాళ్లం. ఇవన్నీ చెప్పకుండా ఏవేవో అబద్దాలు చెబుతున్నారు. నిజాలు చెబితే యాక్సెప్ట్ చేస్తాను, అబద్దాలు చెబుతున్నారు కాబట్టే బాధేస్తోంది…. అని శేఖర్ మాస్టర్ వాపోయారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top