“ఫిదా” సినిమా ఇంటర్వెల్ సీన్ అందుకే కట్ చేసారంట..! రన్నింగ్ ట్రైన్ లోనుండి “సాయి పల్లవి” పడిపోతే…!

ఇప్పుడు ఏడ చూసిన “ఫిదా” ముచ్చటనే నడుస్తున్నది. ఎవర్ని చూడు “ఫిదా” లో “సాయి పల్లవి” ని చూసి ఫిదా అయిపోయినం రా భైయ్ అనే అంటుర్రు. గంత మంచిగ ఆక్ట్ చేసింది సాయి పల్లవి. తెలుగు భాష అంటే తెల్వని పిల్ల తెలంగాణ భాషలో మస్త్ మంచిగ డైలాగ్స్ చెప్పింది. బద్మాష్ అని తిడ్తున్నా మంచిగానే అనిపించింది. తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రాంతాలను స్క్రీన్ మస్త్ మంచిగ సూపెట్టిన్రు శేఖర్ కముల గారు. సినిమా చూసినప్పటి సంధి మైండ్ లోకేంచ్చి పోతలేదు భానుమతి. మరి ఇప్పుడు ఈ సినిమాలో భానుమతి గా చేసిన “సాయి పల్లవి” గురించి  ఒక ముచ్చట చెప్పిర్రు శేఖర్ కముల గారు. అదేందో జరా చూస్కోండి!
సాయి పల్లవిని ఆడిషన్ లో సూడగానే భానుమతి అని ఫిక్స్ అయ్యిపోయిరంట శేఖర్ గారు. సినిమా కోసం మస్తు కష్టపడింది సాయి పల్లవి. రన్నింగ్ ట్రైన్స్ ఎక్కడం, దిగడం, ట్రాక్టర్ నడపడం వంటి చాలా పనులు డూప్ లేకుండానే సొంతగా చేసిందన్నారు. ఇంటర్వెల్ సీన్ లో ఆమె నిజంగానే ట్రైన్ నుండి కింద పడిపోయిందని చెప్పారు. సినిమాలో.. వరుణ్ తో మాట్లాడి కోపం లోభానుమతి ట్రైన్ దిగేసి ఏడుస్తూ కూర్చుంటుంది. అయితే ట్రైన్ వెళ్లిపోతుంటే మళ్లీ పరిగెత్తుకుంటూ రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ సీన్ చేసే ప్రయత్నంలో ఆమె కింద పడిపోయి మోకాళ్ళకు బాగా దెబ్బలు తగిలాయని అన్నారు. అందుకే ఆ సీన్ సినిమాలో పెట్టలేకపోయామని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top