నిమిషం ఆలస్యంగా వచ్చిందని పరీక్ష రాయనివ్వలేదని ఆత్మహత్య చేసుకుంది ఆ చదువులతల్లి.! తప్పు ఎవరిది.?

నిమిషం ఆలస్యం అయినందుకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించని సిబ్బంది…!!
ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఒక చదువులతల్లి,
ఖమ్మం జిల్లా మధిర లో విషాదకర సంఘటన..!!
ప్రభుత్వ ఉద్యోగుల సమయాన్ని పాటించరు చర్యలు అరకొరా
ఎందుకంటే వారి పైన చర్యలు తీసుకునేది ఒక ప్రభుత్వ ఉద్యోగే కదా!!

రాజకీయనాయకులు ప్రజాసమష్యలపైన రాజ్యసభలో సైతం స్పందించరు
కనీసం హాజరు కూడా కారు ఒక భారత రత్నా బిరుదాంకితుడు 90% రోజులు హాజరేకాలేదు ఐనా చర్యలు వుండవు ఇక్కడ చర్యలు తీసుకునే వాడు ఓ రాజకీయనాయకుడే కదా?..!!

బస్సులు సమయానికి రావు ,చేరవు
రైళ్ళు సమయానికి రావు ,చేరలేవు
కొన్ని గ్రామాలకు కనీసం సరైన కాలిభాట కూడా వుండదు
ఐనా ఒక్క నిముషం ఆలష్యమైతే జీవితం మొత్తానికి శిక్షవేసేస్తున్నారు…!!

ఈ అధికారులు…!! ఈ అధికారులకు పిల్లలు లేరా ఈ ఒక్క నిమిషం నిబందనకు పాడాలి చరమ గీతం…!! ఎలాగు మూడు నాలుగు సెట్ల పేపర్లు సిద్దం చేస్తారు కదా లాటరి ద్వారా బి సెట్‌ పేపర్ తో పరిక్ష జరిగిపోతే

ఆలస్యంగా వచ్చిన వారందరికి మరో మిగిలిన సెట్‌తో పేపర్లు రాయించ వచ్చు కదా.? అంతే కానీ కఠిన మనసులతో చిన్నారులను దేశద్రోహుళ్ళా బోడర్‌లో నిలబెట్టినట్టు నిలబెట్టి పో అవతలికి పో అని వారి జీవితం మీద సున్నమార్కులు వేసే ఈ ప్రభుత్వాలకు పాడాలి చరమగీతం…!!

ఆ క్షణం వారు చేయని తప్పుకు వారు పడే బాధ వర్ణాతీతం
ఒక్కసారిగా ఆ కళ్ళు వారికి తెలియకుండా వర్షిస్తునే వుంటాయి గొంతే ఎండిపోతుంది పాధాల కింద భూమి కదిలిపోతుంది

అమ్మానాన్నల ఆశలు చుట్టుపక్కల వారి ఆల్‌దిబె్స్ట్‌లు అన్ని
అన్నీ వృదా ఈ జీవితం వృదా వృదా అనుకుంటు కుప్పకూలిపోయే ఈ పసిడిమొగ్గలను తుంచే హక్కు మీకు ఎవరు ఇచ్చారు

మరణ శిక్షకు పాత్రుడైన దోషికే చివరి కోరిక వుంటుందే….!!
ఏ విద్యార్ధి కావాలని ఆలస్యం చేయరు అనేక ఇబ్బందులు సంఘటణలు ఆలష్యమయ్యేలా చేస్తాయి వారి ప్రమేయమే లేకుండా విది వారిని ఆలష్యంగా చేరవేస్తే అలాంటి అభంశుభం తెలియని విద్యార్ధులకు ఒక్క చాన్‌సు ఇవ్వలేరా మొత్తానికి అకడమిక్‌ ఇయర్‌నే ఫెయిల్‌ చేసేస్తే ఆ చిట్టి హృదయాలు ఎలా తట్టుకుంటాయి…!!

దయచేసి ప్రతీ ఒక్కరు ఆలోచించండి ఈ దగుల్బాజీ ఒక్క నిమిషం నిర్ణయాన్ని వెనక్కి తీసుకును మరో విద్యార్ధి బలికాకుండా ఒక కొత్త జీవో వచ్చేలే ప్రజలు అందరు ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయండి ప్లీజ్‌ _/|\_

ఈ చిట్టి తల్లి ఆత్మకు శాంతి చేకూరేలా ఈ ఖర్ఖస ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ప్రతీ ఒక్కరు కోరుకోండి _/|\_

Comments

comments

Share this post

scroll to top