క‌ళ్ళ‌ముందే యాక్సిడెంట్ అయ్యి…అమ్మానాన్న‌లు చ‌నిపోయారు. ఆ షాక్ కి ఆమె మ‌తిస్థిమితం కోల్పోయింది.! చివ‌ర‌కు ఇదిగో ఇలా.!!

జీవితం అంటే అంతే. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. ఏ క్ష‌ణాన జీవితం మలుపు తిరుగుతుందో అంత‌క‌న్నా తెలియ‌దు. కొన్ని సంఘ‌ట‌న‌లు అమిత‌మైన సంతోషాన్ని క‌లిగిస్తే, కొన్ని సంఘ‌ట‌న‌లు విషాదాన్ని నింపుతాయి. ఇంకొన్ని జీవితాన్ని అంధ‌కారంలోకి నెట్టేస్తాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ యువ‌తి, యువ‌కుడి గురించే. వారు అన్నా చెల్లెల్లు. తల్లిదండ్రులు, సోద‌రి చ‌నిపోవ‌డంతో షాక్‌కు లోనై కొన్నేళ్ల పాటు ఇంట్లోనే ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి వారు రిక‌వ‌రీ అవుతున్నారు.

ఆమె పేరు అంజ‌న‌. ల‌క్నో వాసి. ఆమెకు ఓ అక్క‌, అన్న ఉన్నారు. అయితే అంజన తండ్రి ఆర్మీలో మేజ‌ర్‌. అది 2005వ సంవ‌త్స‌రం. అప్పుడు అంజ‌న వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. అప్పుడామె ల‌క్నో యూనివ‌ర్సిటీలో ఎంఏ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. అయితే అనుకోకుండా జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో అంజ‌న త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. దీంతో అంజ‌న‌తోపాటు ఆమె అక్క‌, అన్న ఇద్ద‌రూ కూడా తీవ్ర‌మైన మాన‌సిక ఆందోళ‌న‌కు లోన‌య్యారు. డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయారు.

అలా డిప్రెష‌న్ లోకి వెళ్లిన అంజ‌న అక్క ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయింది. దీంతో అంజ‌న‌, ఆమె అన్న ఇద్ద‌రూ ఇంకా ఎక్కువ షాక్‌కు లోన‌య్యారు. అలా జ‌రగ‌డంతో వారిద్దరికీ మ‌తి స్థిమితం త‌ప్పిపోయింది. ఈ క్ర‌మంలో బంధువులు వారిని వారి ఇంట్లోనే ఖైదీల‌ను చేశారు. అప్ప‌టి నుంచి 12 ఏళ్ల పాటు వారు ఇంట్లోనే బందీలు అయ్యారు. త‌రువాత కొన్నిరోజుల‌కు బ‌య‌టికి వ‌చ్చి బిచ్చ‌మెత్తుకోవ‌డం ప్రారంభించారు.

అలా వారు చేస్తుండ‌డంతో వారిని ప‌లువురు స్వ‌చ్ఛంద సేవ‌కులు స్థానికంగా ఉన్న ఓ రిహాబిలిటేష‌న్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. అప్ప‌టి నుంచి కొంత కాలం పాటు వారికి ట్రీట్‌మెంట్ జ‌రిగింది. దీంతో అంజ‌న రిక‌వ‌రీ అయింది. కానీ ఆమె అన్నకు ఇంకా చికిత్స కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే అంజ‌న‌కు అదే ఆస్ప‌త్రిలో ఉన్న క్యాంటీన్‌లో ఉద్యోగం కూడా ఇచ్చారు. రోజూ ఆమె ఉద్యోగానికి వెళ్లి వ‌స్తూ త‌న ప‌నులు తాను చేసుకుంటోంది. నిజంగా అంత‌టి షాక్ నుంచి రిక‌వ‌రీ అయిందంటే న‌మ్మ‌లేకుండా ఉన్నాం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top