నల్లగా ఉన్నావని ఆ యువతిని ఏడిపించారు… ఆమే ఇప్పుడు సూపర్ స్టార్.!

నలుపు రంగులో ఉన్నవారిని సమాజంలో ఎలాంటి చిన్న చూపు చూస్తారో అందరికీ తెలిసిందే. వారి ఎదురుగా అనకపోయినా వెనుక మాటుగా ఎన్నో కామెంట్లు, జోకులు వారిపై పేల్చుతుంటారు. కొన్ని సందర్భాల్లోనైతే కొందరు ఏకంగా అలాంటి వారిని ఎదురుగానే కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి వారు ఎవరైనా అధిక శాతం వరకు తీవ్రంగా కుంగిపోతారు. మానసిక ఒత్తిడికి లోనవుతారు. తాము అలా పుట్టినందుకు తమను తామే నిందించుకుంటారు. కానీ ఆ యువతి మాత్రం అలా చేయలేదు. తనపై చేసిన కామెంట్లను ఆమె పట్టించుకోలేదు. నల్లగా ఉన్నావని ఎగతాళి చేసినా కుంగిపోలేదు. అవే కామెంట్లను స్పోర్టివ్‌గా తీసుకుంది. తానేంటో నిరూపించాలనుకుంది. అనుకున్న విధంగానే చేసి చూపి తన సత్తా చాటింది. ఇంతకీ ఆమె ఏం సాధించింది..?

khoudia-diop

ఆమె పేరు ఖౌడియా డియోప్. వయస్సు 19 ఏళ్లు. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఈమె ప్రస్తుతం కెరీర్ కారణంగా పారిస్‌లో ఉంటోంది. అయితే డియోప్ చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అందుకు కారణం ఆమె రంగే. శరీర రంగు మరీ నల్లగా ఉండడంతో ఆమెను అందరూ ఏడిపించే వారు. డాటర్ ఆఫ్ నైట్ (రాత్రి కూతురు) అని గేలి చేసే వారు. కొందరైతే ఆమె ముఖం మీదే కామెంట్లు చేసే వారు. అయినా వాటిని డియోప్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమె 17వ ఏట ఉండగా ఓ మోడలింగ్ కంపెనీ ఆమె ఫోటోలను చూసి తమ కంపెనీకి మోడల్‌గా సెలెక్ట్ చేసింది. అంతే అప్పటి నుంచి ఆమె దశ తిరిగిపోయింది.

కేవలం రెండేళ్ల కాలంలోనే డియోప్ ఓ పెద్ద మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ఆమెకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లు కూడా పెరిగిపోయారు. ఇన్‌స్టాగ్రాంలో అయితే ఏకంగా 2.35 లక్షల మంది ఫాలోవర్లు ఆమెకు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది డియోప్‌లో ఉన్న మోడలింగ్ సత్తా ఏమిటో… ఆమె అసలైన అందం ఏమిటో..! అందుకే చాలా మంది ఆమెను ఇంకా పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు కూడా. అంతేకాదు ఆమెకు మెలనిన్ గాడెస్ అనే పేరిట ముద్దుగా పిలుచుకుంటున్నారు. అంతేగా మరి. ప్రతిభ ఉండాలే గానీ దానికి రంగుతో, వర్గంతో పనిలేదు. ఎలాంటి రంగంలోనైనా రాణించవచ్చు.

డియోప్ వీడియోను కింద వీక్షించవచ్చు..!

Comments

comments

Share this post

scroll to top