22 ఏళ్ల వయసులో 136 కిలోలు ఉండేది…26 ఏళ్ళకి 58 కిలోలకు బరువు తగ్గింది…ఏం చేసిందో తెలుసా..?

కష్టే ఫలి అన్నారు పెద్దలు..చాలామంది ఏ కష్టం చేయకుండా ఈజీగా రిజల్ట్ కనపడాలనుకుంటారు.. చేసే కష్టం కూడా పాజిటివ్ థృక్పథంతో చేస్తే మంచి రిజల్ట్ కనపడుతుందంటాను నేను..మనలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య స్థూలకాయం..చిన్నాపెద్ద తేడాలేకుండా అడ్డూఅదుపులేకుండా బరువు పెరిగిపోతూ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు..ఆ బరువు తగ్గించుకోవడానికి గంటలు గంటలు పార్కుల్లో వాకింగ్లు,జిమ్లలో వర్కౌట్లు అయినప్పటికి ఫలితం శూన్యం..కానీ ఒకమ్మాయి బరువు తగ్గి తాను అనుకున్నది సాధించింది..136 కిలోల నుండి 58కిలోలకు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఆ అమ్మాయి లారా మిటెచ్..దాని వెనుక నాలుగేళ్ల శ్రమ ఉంది..

లారా మిచెట్ కి  ప్రీ డయాబెటిస్ వచ్చింది. అంతేకాదు ఆమెకు బ్లెడ్‌ప్రెషర్ కూడా ఎక్కువైందని డాక్టర్లు చెప్పారు. వెంటనే లైఫ్‌స్టైల్ మార్చుకోకపోతే చాలా ప్రమాదమని హెచ్చరించారు. దాంతో ఆమెలో కలవరం మొదలైంది. 22 ఏళ్ల వయసులోనే ఆమె 136 కిలోల బరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సర్జరీ ద్వారా బరువు తగ్గాలని స్నేహితులు సలహ ఇచ్చారు.ఇటీవల చాలామంది బరువు తగ్గాలనుకునేవారు సర్జరీలను ఆశ్రయించడం అవి ఫెయిలవడం,లేదంటే మరో కొత్త సమస్యలను తెచ్చిపెట్టడం మనం చాలానే చూశాం..  అయితే లారా బరువు తగ్గేందుకు ఎటువంటి సర్జరీలు చేయించుకోనని తెగేసి చెప్పింది. అయితే ఇక తను బరువు తగ్గడం కష్టమేనని, ఎక్సర్‌సైజ్‌ చేసి బరువు తగ్గడం ఇంపాజిబుల్ అని,నువ్ ఆ విధంగా ఎప్పటికీ బరువు తగ్గలేవని   ఆమెను అంతా చులకనగా మాట్లాడారు.పిజ్జాలు, బర్గర్‌లు తినే అమ్మాయివి నోరు కట్టుకుని ఎక్సర్‌సైజ్‌లు చేయలేవంటూ హేళనగా మాట్లాడారు.

అయినా లారా మిచెట్  వెనక్కి తగ్గలేదు. కచ్చితంగా తాను బరువు తగ్గి చూపిస్తానని చెప్పింది.చెప్పడమే కాదు ఎలాగైనా బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకుంది.. 22 ఏళ్ల వయసులో జిమ్‌కెళ్లడం మొదలుపెట్టింది. దాదాపు సంవత్సరం తరువాత ఆమె బరువు తగ్గడం మొదలైంది. అలా నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జిమ్‌కెళ్తోంది. 136 కిలోల బరువున్న ఆమె 26 ఏళ్ల వయసులో 58 కిలోల బరువుంది.లారాను హేళన చేసినవాళ్లు ప్రస్తుతం తనను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top