“అర్జున్‌రెడ్డి అవకాశం వదులుకున్నందుకు బాధగా ఉంది..” అంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది అనే సామెత సినిమా వారికి కరెక్ట్ గా సరిపోతుంది.మనకు ఒక సినిమా అవకాశం వచ్చి,దాన్ని మనం రిజెక్ట్ చేస్తే..ఆ సినిమా మరొకరు చేసి సూపర్ డూపర్ హిట్ అయితే అప్పుడుంటుంది మన బాద..వర్ణానాతీతం..ఒక్క ఛాన్స్ కోసం ఎందరో పడిగాపులు కాస్తుంటారు.ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఏదొ ఒక కారణం చేత రిజెక్ట్ చేస్తారు.జరగాల్సింది జరిగిపోయాకా వాపోయి ఫలితం లేదు కదా..ఇప్పుడు పార్వతి నాయర్ పరిస్థితి అదే..ఇంతకి ఆమె వదులుకున్న పాత్ర ఏదో తెలుసా…?

సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు చిత్ర కథలకు కొత్త దారిని చూపించింది.. బోల్డ్ కథలను సైతం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది.ఈ సినిమాలో అర్జున్ పాత్రకి ఫలానా హీరోలని సందీప్ సంప్రదించాడు.కాని వారు రిజెక్ట్ చేయడంతో విజయ్ ని వరించింది అని చెప్పుకున్నాం కాని..షాలిని పాత్రకు కూడా మరొక హీరోయిన్ ని సంప్రదించాడట..ఆమె మళయాళి బ్యూటి పార్వతి నాయర్. ఇందులో హీరోయిన్ గా చేస్తే ఇక అవకాశాలు రావని బయపడి,నటించడానికి ఒప్పుకోలేదట. కానీ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే కి వచ్చిన ఛాన్స్ లను చూసి ఇప్పుడు బాధపడుతోంది.

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంట‌ర్యూలో ఆ సినిమా గురించి మాట్లాడింది. “అర్జున్‌రెడ్డి` క‌థ ముందు నేనే విన్నాను.అయితే సినిమాలో చాలా లిప్‌లాక్‌లు ఉంటాయ‌ని తెలిసి భ‌య‌ప‌డ్డా. అందుకే చేయ‌లేక‌పోయా. అందుకు ఇప్పుడు బాధ‌ప‌డుతున్నా. ఆ సినిమా విజయాన్ని, అందులో నటించిన హీరోయిన్‌కు వ‌చ్చిన పాపులారిటీని నేను ఊహించ‌లేక‌పోయాను” అని పార్వ‌తి వివరించింది. ప్రస్తుతం షాలిని పాండే మహానటి చిత్రంలో చిన్న రోల్ చేస్తోంది. అలాగే తమిళంలో, తెలుగులో సినిమాలకు సైన్ చేసింది. ఇవి హిట్ అయితే రెండు పరిశ్రమల్లోను టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుంది.

Comments

comments

Share this post

scroll to top