బిగ్ బాస్ షోకు స్టార్టింగ్ లోనే పెద్ద షాక్..! డ్రగ్స్ విషయమై షోలోనే ఆమెను విచారిస్తారంట?

ఆసక్తికరమైన రీతిలో ఆరంభం అయిన ఎన్టీఆర్ బిగ్‌బాస్ కు కొన్ని ఆటంకాలు తప్పేలా లేవు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు బిగ్ బాస్ షో కు ఎఫెక్ట్ చూపించేలా ఉంది. డజనుకు పైగా సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి ఇప్పటికే. కానీ… ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడింది. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ నోటీసులు ఎదుర్కొన్న వాళ్లలో ఒకరు బిగ్‌బాస్ లో పాల్గొంటున్న వారిలో ఉండటంతో.. ఇప్పుడు ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో ఈ నెల 21 వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులు నటి ముమైత్ ఖాన్ కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పూనేలో బిగ్ బాస్ షో ప్రోగ్రాం షూటింగ్ నడుస్తున్నది. ఆ ప్రోగ్రాంలో ప్రస్తుతం ముమైత్ ఖాన్ పార్టిసిపెంట్ గా ఉన్నారు. ఆమె బిగ్ బాస్ షో పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదన్నది ఆ షో నిర్వాహకులు చెబుతున్నమాట. కాబట్టి ఈనెల 21వ తారీకున ముమైత్ ఖాన్ ను విచారణకు రమ్మని ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ వారు తాఖీదు పంపేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె పూనే లో బిగ్ బాస్ షో లో ఉండిపోయింది. దీంతో ముమైత్ ఖాన్ ను విచారించాలంటే ఎక్సైజ్ అధికారులు అక్కడికే వెళ్తారేమో అనే వార్త కొన్ని ప్రముఖ న్యూస్ చానెల్స్ లో వినిపిస్తుంది.

షో ఇటీవలే మొదలైంది. ఇప్పటివరకు షూటింగ్ పూర్తైన ఎపిసోడ్స్ లోనే ముమైత్ ఖాన్ ఎగ్జిట్ అయితే ఎటువంటి సమస్య ఉండదు. కానీ అలా జరగకపోతే సమస్య వచ్చి పడుతుంది. ఎందుకంటే ఒకసారి షో నుండి ఎగ్జిట్ అయితే రీ-ఎంట్రీ ఉండదు.

 

Comments

comments

Share this post

scroll to top