దళిత మహిళ మధ్యాహ్న భోజనం వండుతుందని స్కూల్ మానేసిన 100 మంది విద్యార్ధులు.!

అప్పటివరకూ 118 మంది స్టూడెంట్స్ ఆ పాఠశాలలో చదువుతుండగా, 100 మంది ఒకేసారి స్కూల్ కు రావడం మానేశారు. మిగిలిన 18 మందిలో మద్యాహ్న భోజన సమయానికి  స్కూల్లో మిగిలేది  అయిదుగురు మాత్రమే… కారణం ఏంటి అని ఆరా తీస్తే తెలిసిందేంటంటే…. ఆ స్కూల్లో మద్యాహ్న భోజనం వండేది రాధమ్మ అనే ఆమె ఓ దళిత మహిళ కావడం. నిజంగా ఆధునిక కాలంలో ఉన్నాం, టెక్నాలజీ రంగంలో ముందుకు వెళుతున్నామని సంబర పండాలో లేక…. రేపటి పౌరులను జాతికి అందించే పాఠశాలలో కూడా  పనిగట్టుకొని కుల, మత, వర్గ  వివక్షతల విష భీజాలు నాటుతున్నారని బాధపడాలో అర్థం కాని పరిస్థితి  ఏర్పడింది.

ఇది ఇప్పటికీ  కర్నాటక రాష్ట్రమైన తుంకూర్ తాలుకాలోని, కగ్గనహళ్లి గ్రామంలోని ప్రాధమిక పాటశాలలో జరుగుతున్న వాస్తవిక స్థితి.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్నభోజన పధకంలో భాగంగా ఇక్కడ స్కూల్లో వంటలు రాధమ్మ అనే దళిత మహిళ చేస్తుంది… అప్పటి నుండి ఆ ఊరిపిల్లలు ఆ స్కూల్ ను మానేసి, పక్క ఊరిలోని స్కూల్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారంట…

dat

దీనిపై రాధమ్మ స్పందిస్తూ….నేను  వండిన ఆహరమే కాదు,పాలు కూడా తీసుకోవట్లేదు, పిల్లల తల్లిదండ్రులే ఆమె వండిన భోజనాన్ని తినకండని చెబుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ భావన పోగొట్టడానికి ఇక్కడి  విద్యాశాఖాధికారి,ఇతర అధికారులతో కలిసి ఈ స్కూల్లో రాధమ్మ వండిన భోజనం చేసినప్పటికీ  వారిలో మాత్రం మార్పు రాలేదు.

Comments

comments

Share this post

scroll to top