ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఏకైక హిజ్రా ఈమే..!

సమాజంలో వారు మూడో ర‌కం మ‌నుషులు. అందుకే వారిని అంద‌రూ అసహ్యించుకుంటారు. ఇంకొంద‌రు చిత్ర హింస‌ల‌కు గురి చేస్తారు. ఎక్క‌డికి వెళ్లినా వారికి చ‌దువు చెప్ప‌రు. ప‌నివ్వ‌రు. ఒక్క మాట‌లో చెప్పాలంటే 3వ కేట‌గిరీ మ‌నుషులు అయినందుకు వారిని స‌మాజం వెలివేసిన‌ట్టు చూస్తుంది. కానీ… వారిని అలా అస‌హ్యంగా చూడ‌కూడ‌ద‌ని, వారూ మ‌నుషులేన‌ని… వారికీ కొన్ని హ‌క్కులు ఉంటాయ‌ని… చెబుతూ అలాంటి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తుంది ఆమె. అంతేకాదు, ఏకంగా ఎమ్మెల్యే స్థానానికే పోటీ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమే… ఉత్త‌రాఖండ్‌కు చెందిన ర‌జ‌నీ రావ‌త్‌.

rajni-rawat

ర‌జ‌నీ రావ‌త్ ఓ ట్రాన్స్‌జెండ‌ర్ (హిజ్రా). అయినా ఆమె ఎన్న‌డూ దిగులు చెంద‌లేదు. ఎవ‌రూ పనివ్వ‌క‌పోయినా త‌మ వ‌ర్గంతో క‌లిసి ఫంక్ష‌న్లు, ఓపెనింగ్స్ వంటి వాటికి వెళ్తూ, అక్క‌డి వారికి ఆశీర్వ‌చ‌నాలు అందించి… వారిచ్చిన దాంతోనే బ‌తికేది. అలా అలా ఆమె ఆర్థికంగానూ బాగానే ఎదిగింది. ఈ క్ర‌మంలో ఆమె 2008లో డెహ్రాడూన్ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. మొత్తం ఆమెకు 44వేల ఓట్లు వ‌చ్చాయి. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మి పాలైనా కాంగ్రెస్‌ను వెన‌క్కి నెట్టి రెండో స్థానంలో నిల‌వ‌డం విశేషం. దీంతోపాటు ఆమె 2012లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో, 2013 మేయ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. అయినా విజ‌యం వరించ‌లేదు.

rajni-rawat-2

2009లో ఆమె ఎల‌క్ష‌న్ల‌లో పోటీ చేయ‌లేదు. కానీ కాంగ్రెస్ లీడ‌ర్‌కు మ‌ద్ద‌తునిచ్చింది. 2014 ఎన్నిక‌ల్లోనూ అలాగే చేసింది. ఈ క్ర‌మంలో ఆమెకు 2015లో స్టేట్ వుమెన్ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌గా ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఈ సారి జ‌రుగుతున్న ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ల‌భించ‌లేదు. దీంతో ఆమె పార్టీకి రిజైన్ చేసి స్వతంత్ర అభ్య‌ర్థిగా రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యే ప‌ద‌వి కోసం పోటీ చేసింది. రాయ్‌పూర్‌, ధ‌రంపూర్‌ల‌లో ర‌జ‌నీ రావ‌త్ పోటీకి దిగింది. ఈ క్ర‌మంలో ఈ నెల 15వ తేదీన ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే ఆ రోజున పోటీ ప‌డ్డ అభ్య‌ర్థులు ఇద్ద‌రే. వారిలో ఒక‌రు సీఎం హ‌రీష్ రావ‌త్‌. రెండో వ్య‌క్తి ర‌జ‌నీ రావ‌త్‌. వీరిద్ద‌రూ రెండు రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యే ప‌ద‌వి కోసం పోటీ చేయ‌డం విశేషం. కాగా ర‌జ‌నీ రావ‌త్ ఉత్త‌రాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉన్న ఏకైక హిజ్రా కావ‌డం కూడా విశేషం. అయితే… అసెంబ్లీ ఎన్నికల సంద‌ర్భంగా ర‌జ‌నీ రావ‌త్ త‌న అఫిడ‌విట్‌లో త‌న‌కు ఉన్న ఆస్తుల గురించి కూడా చెప్పింది. రూ.85 ల‌క్ష‌ల విలువ గ‌ల ఓ ఆడి కారు, రూ.22 ల‌క్ష‌ల విలువ గ‌ల ట‌యోటా ఫార్చున‌ర్ కారు, 500 గ్రాముల బంగారం త‌దిత‌రాలు క‌లిపి మొత్తం రూ.3.60 కోట్ల ఆస్తి మాత్ర‌మే త‌న‌కు ఉంద‌ని చెప్పింది. అయినా… త‌న‌కు ఓ ఫ్యామిలీ అంటూ లేద‌ని… క‌నుక రాజ‌కీయాల్లోకి వస్తే అవినీతికి తావుండ‌ద‌ని, ప్ర‌జ‌ల‌కు కాక ఇంకెవ‌రికి సేవ చేస్తాన‌ని ఆమె అంటోంది. మ‌రి ఈ సారైనా ఆమె గెలుస్తుందా లేదా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top