ఆమె ఒక‌ప్పుడు ఫెయిల్యూర్ స్టూడెంట్‌. ఇప్పుడు ఆలిండియా లెవ‌ల్లో టాప‌ర్ తెలుసా..?

నిజంగా అత్యుత్త‌మ విజ‌యాలు అనేవి అంద‌రినీ వ‌రించ‌వు. ఎంతో శ్ర‌మిస్తే గానీ అలాంటి విజ‌యాలు ఎవ‌రికీ ద‌క్క‌వు. చాలా కఠోర‌మైన శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల‌, అంకిత భావం ఉంటేనే ల‌క్ష్యాలు సాధించ‌గ‌లుగుతారు. అదిగో… ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ బాలిక గురించే. ఇంత‌కీ ఆమె ఏం చేసిందో తెలుసా..? ఈ మ‌ధ్యే జ‌రిగిన సీబీఎస్ఈ క్లాస్ 12 ప‌రీక్ష‌ల్లో 99.6 శాతం ఉత్తీర్ణ‌త‌ను సాధించి ఆలిండియా వైడ్‌గా టాప‌ర్‌గా నిలిచింది. ఆమె గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఆ బాలిక పేరు ర‌క్ష గోపాల్‌. ఉంటున్న‌ది నోయిడాలో. వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు. ఇటీవ‌లే అక్క‌డి అమైటీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో చ‌దివి సీబీఎస్ఈ క్లాస్ 12 పూర్తి చేసింది. అయితే ఈ మ‌ధ్యే ఈమె ఫైన‌ల్ ప‌రీక్ష‌లు రాసింది. ఈ క్ర‌మంలో ర‌క్ష ఏకంగా 99.6 శాతం ఉత్తీర్ణ‌త‌ను సాధించి ఆలిండియా లెవ‌ల్‌లో టాప‌ర్‌గా నిలిచింది. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇంగ్లిష్, పొలిటిక‌ల్ సైన్స్‌, ఎక‌నామిక్స్‌ల‌లో 100 మార్కుల‌కు 100 రాగా, హిస్ట‌రీ, సైకాల‌జీల‌లో 99 మార్కులు సాధించింది. దీంతో ఆమె ఆ మేర ఉత్తీర్ణ‌త సాధించింది. అయితే నిజానికి మీకు తెలుసా..? ర‌క్ష ఒక‌ప్పుడు అంటే 3వ త‌ర‌గ‌తిలో 0 మార్కులు సాధించింది.

ఆ త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు ర‌క్ష ఓ ఫెయిల్ స్టూడెంట్‌. స్కూల్ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల్లో 0 మార్కులు సాధించింది. అయితే ఆమెను తండ్రి ఏమన‌లేదు, పైగా ఓ మాట చెప్పాడు, అదేమిటంటే… 0 కాదు అంత క‌న్నా త‌క్కువ‌గా అంటే మైన‌స్ మార్కులు సాధించు, కానీ నాలెడ్జ్ పెంచుకో. మార్కుల‌కు, నాలెడ్జ్‌కు సంబంధం లేదు, అని అన్నాడు. దీంతో ర‌క్ష అప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డి చ‌ద‌వ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది. నేడు సీబీఎస్ఈ క్లాస్ 12 బోర్డు పరీక్ష‌ల్లో అలా టాప‌ర్ గా నిలిచింది. అయితే ఇప్పుడామె ఏం చ‌ద‌వాల‌నుకుంటుందో తెలుసా..? బీఏ (ఆన‌ర్స్‌). ఢిల్లీ యూనివ‌ర్సిటీలో అడ్మిష‌న్ కోసం చూస్తోంది. అయితే మొన్నా మ‌ధ్యే సీబీఎస్ఈ క్లాస్ 12 రిజ‌ల్ట్ రాగా ఆమె ఉత్తీర్ణ‌త శాతం తెలుసుకున్న కేంద్ర మానవ వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ర‌క్ష‌కు స్వ‌యంగా ఫోన్ చేసి మ‌రీ అభినందించారు తెలుసా..? కాగా అలా టాప‌ర్‌గా నిలిచినందుకు గాను ఆమె ఇప్పుడు తండ్రిని టూర్‌కు తీసుకెళ్ల‌మ‌ని అడుగుతుంద‌ట‌. అవును మ‌రి, అలాంటి పిల్ల‌లు ఉంటే ఏ త‌ల్లి దండ్రులు టూర్ ప్లాన్ చేయ‌రు చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top